కరోనా పేషెంట్ లనునిలువు దోపిడీ చేస్తున్న ప్రైవేట్ హాస్పిటల్స్
Published by:Admin, Date:08-07-2020:09:38

కరోనా విలయతాండవం చేస్తున్న వేళ హైదరాబాద్ మహానగరంలో ప్రైవేట్ హాస్పిటల్స్ కరోనా పేషెంట్ నునిలువు దోపిడీ చేస్తున్నట్లు తీవ్ర విమర్శలు వినపడుతున్నాయి .కరోనా ను కట్టడి చేయడంలో తెలంగాణ ప్రభుత్వం విఫలం అయిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి .ఈ నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హయాంలో సలహాదారుగా వ్యవహరించిన పరకాల ప్రభాకర్ మాట్లాడుతూ హైదరాబాదులో ఓ ప్రైవేట్ హాస్పిటల్ 10 లక్షలకు పైగా కరోనా పేషెంట్ కు బిల్లు వేశారని ఆశ్చర్యం వ్యక్తం చేశారు .ఆంధ్రప్రదేశ్ తో పోలిస్తే చిన్న రాష్ట్రమైన తెలంగాణలో ఆంధ్ర ప్రదేశ్ ను మించి కరోనా కేసులు పెరుగుతున్నాయి .మరోవైపు ప్రభుత్వం కరోనా కేసులు నుఆరోగ్యశ్రీ లో చేర్చలేదు .ప్రైవేట్ హాస్పిటల్ లో సొంత వైద్యం చేసుకోవడానికి అనుమతి ఇవ్వడంతోకార్పొరేట్ ప్రైవేట్ హాస్పిటల్స్ నిలువు దోపిడీ చేస్తున్నాయి .మెరుగైన వైద్యం కోసం ప్రైవేట్ హాస్పిటల్స్ వెళుతున్న సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు .ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో రోజుకు 1500నుంచి రెండు వేల కేసులు నమోదు కావడంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు .ఒక దశలో పూర్తి లాక్ డౌన్ విధించాలని అనుకున్నప్పటికీ మళ్లీ వెనుకడుగు వేశారు .ముఖ్యమంత్రి కెసిఆర్ అధికార నివాసం ప్రగతి భవన్ లో 30 మందికి కరోనా సోకిందనే నేపథ్యంలో కెసిఆర్ అజ్ఞాతంలో ఉండడంతో ముఖ్యమంత్రి ఆరోగ్యంపై కోర్టు కేసు కూడా వేయడం చర్చనీయాంశంగా మారింది .కరోన టెస్టులు సంఖ్య దేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్థానంలో ఉండగా ఢిల్లీ తర్వాతస్థానంలో ఉంది .తెలంగాణలోచాలా తక్కువ టెస్ట్ చేస్తున్నారని ఇప్పుడే ఇలా ఉంటే టెస్టులు సంఖ్య పెంచితే పరిస్థితి ఎలా ఉంటుంది అనే చర్చ జరుగుతోంది .ఈ మేరకు ప్రొఫెసర్ కోదండరామ్ తీవ్ర విమర్శలు చేశారుకేంద్ర సహాయ మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ఢిల్లీ తరహాలో కరోనా పరీక్షలు చేయాలని ప్రైవేట్ హాస్పిటల్స్ నిలువుదోపిడి పై దృష్టి సారించాలని కేసీఆర్ ప్రభుత్వాన్ని కోరారు .ప్రభుత్వ ఆధీనంలో ఉన్న వెంటిలేటర్స్ ఉపయోగించుకోవాలనిచెప్పారు. ఇప్పటికే వైద్య పరికరాల కోసం కేంద్ర ప్రభుత్వం 215 కోట్లు విడుదల చేసిందని చెప్పారు


fb twittar linkedin google+ pinterest

WRITE COMMENT

Name:
Phone/Email:
Comment: