ఇంటి పన్నునులు జూలై 31వ తేదీ లోపల చెల్లించే వారికి 5 శాతం రాయితీ
Published by:Admin, Date:27-07-2020:01:03

తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ చాంబర్ నందు సోమవారం ఉదయం రెవెన్యూ అధికారులతో కమిషనర్ గిరీష సమీక్ష నిర్వహించి నగరంలో ఉన్న మొండి బకాయిదారుల కి రెడ్ నోటీసులు ఇచ్చి వారి దగ్గర జూలై 31వ తేదీ నాలుగు రోజులు లోపల నగరపాలక సంస్థ కట్టవలసిన ఆస్తి పన్నులు, నీటి పన్నులు, భూగర్భ డ్రైనేజీ పన్నులు, ఖాళీ జాగా పన్నులు మరియు అడ్వర్టైజ్ మెంట్ చార్జీలు నాలుగు రోజుల లోపల కట్టించాలని, మొండి బకాయిల దారులకు నోటీసు ఇచ్చినా స్పందించకపోతే నగరపాలక సంస్థ కల్పిస్తున్న సదుపాయాలు తొలగించాలని రెవెన్యూ అధికారులను కమిషనర్ ఆదేశించారు. కమిషనర్ గిరీష నగర ప్రజలను ఉద్దేశించి తిరుపతి నగరపాలక సంస్థ 2020-21వ ఆర్థిక సంవత్సరమునకు ఇంటి పన్నులు ముందస్తుగా చెల్లిస్తే 5 శాతం డిబేట్( అసలు రాయితీ) ఇస్తున్నట్లు నగర ప్రజలకు తెలియజేశారు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు 2020-21 సంవత్సరమునకు పూర్తిగా చెల్లించిన ఎడల 5% రాయితీ గడువు జూలై 31వ తేదీ వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది అన్నారు కావున ప్రభుత్వం వారు కల్పించిన రాయితీని సద్వినియోగం చేసుకొనుటకు నగరంలోని ప్రజలు (cdma.ap.gov.in website) cdma ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇన్ వెబ్ సైట్ ఓపెన్ చేసి ఆన్లైన్ పేమెంట్ ఓపెన్ చేసి ప్రాపర్టీ టాక్స్ ను క్లిక్ చేస్తే పది అంకెల అసెస్మెంట్ ద్వారా చెల్లింపు చేయవలసిందిగా కోరడమైనది. కావున నగర ప్రజలు ప్రభుత్వం వారు కల్పించిన 5% రాయితీని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరడమైనది. తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయం ఆవరణంలో నెహ్రూ లలిత కళా ప్రాంగణంలో ఐదు కౌంటర్లు ఏర్పాటు చేసి ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఆస్తి పన్నులు, భూగర్భ డ్రైనేజీ పన్నులు, నీటి పన్నులు, ఖాళీ జాగా పన్నులు మరియు అడ్వర్టైజ్మెంట్ చార్జీలు కట్టించుకుంటారు అని మరియు సకాలంలో చెల్లించి నగరాభివృద్ధికి తోడ్పడాలని తెలియజేశారు. ఈ సమీక్ష సమావేశంలో కమిషనర్ వారితోపాటు రెవిన్యూ అధికారి సేతు మాధవ్, రెవిన్యూ ఇన్స్పెక్టర్ శంకర్, సూరిబాబు, ప్రకాష్, రఫీ, అకౌంటెంట్ రమేష్ తదితరులు పాల్గొన్నారు.


fb twittar linkedin google+ pinterest

WRITE COMMENT

Name:
Phone/Email:
Comment: