కరోనా బారిన పడ్డ రాజమౌళి కుటుంబం
Published by:Admin, Date:29-07-2020:11:48

బాలీవుడ్ దర్శక దిగ్గజం రాజమౌళి కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తెలిపారు. రెండు రోజుల క్రితం తాను, తన కుటుంబసభ్యులు స్వల్ప జ్వరంతో బాధపడ్డామని చెప్పారు. జ్వరం తగ్గిపోయిందని… అయినప్పటికీ తాము కోవిడ్ టెస్టులు చేయించుకున్నామని… తమకు స్వల్ప స్థాయిలో కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయిందని తెలిపారు. వైద్యుల సూచనల మేరకు హోం క్వారంటైన్ లో ఉన్నామని చెప్పారు. ఇప్పుడు బాగానే ఉన్నామని తెలిపారు. కరోనా లక్షణాలు లేకపోయినా అన్ని నిబంధనలు పాటిస్తున్నామని, జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పారు. యాంటీబాడీలను డెవలప్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నామని… ఆ తర్వాత ప్లాస్మా దానం చేస్తామని తెలిపారు.


fb twittar linkedin google+ pinterest


WRITE COMMENT

Name:
Phone/Email:
Comment: