ఆగస్టు 1న వాలంటరీ ద్వారా ఇంటికే పెన్షన్ డబ్బులు
Published by:Admin, Date:30-07-2020:06:37

ప్రతినెలా ఒకటో తేదీనే పెన్షనర్లకు వారికి అందాల్సిన ఫించన్ మొత్తాన్ని ఖచ్చితంగా అందేలా చూడాలన్న ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌ జగన్ ఆదేశాల మేరకు జూలై నెలకు సంబంధించిన పెన్షన్‌ను ఆగస్టు ఒకటో తేదీనే అందించేందుకు అధికారులు అన్ని చర్యలు తీసుకున్నారు. గ్రామ, వార్డు సచివాలయాల కార్యదర్శుల ఖాతాలకు ఇప్పటికే పెన్షన్ సొమ్మును జమ చేశారు. వాలంటీర్లు ఈ సొమ్మును నేరుగా లబ్ధిదారుల ఇళ్ళకు వెళ్లి అందించనున్నారు. గతంలో పెన్షన్ కోసం ప్రభుత్వ కార్యాలయాల వద్ద వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు పడిగాపులు కాసే పరిస్థితిని ప్రభుత్వం పూర్తిగా మార్చేసింది. ప్రతినెలా ఒకటో తేదీన ఉదయం నుంచే పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఒక యజ్ఞంలా నిర్వహిస్తున్నారు. పెన్షన్ల పంపిణీలో ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి స్థాయి నుంచి గ్రామ, వార్డు స్థాయి కార్యదర్శి వరకు భాగస్వాములు అవుతుండటం విశేషం. రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణ చర్యల్లో భాగంగా ఈ నెల కూడా పెన్షనర్ల బయో మెట్రిక్ కు బదులు జియో ట్యాగింగ్‌తో కూడిన ఫోటోలను తీసుకుని, పెన్షన్ అందిస్తారని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ఫ్) సిఇఓ పి.రాజాబాబు తెలిపారు. ఈ నెలలో రాష్ట్ర వ్యాప్తంగా 6734 మంది పెన్షనర్లు పోర్టబులిటీ ద్వారా పెన్షన్ తీసుకుంటున్నారని, అలాగే 1458 మందికి సంబంధించి లాక్‌డౌన్‌తో ఇతర ప్రాంతాల్లో వుండిపోవడం వల్ల ఈనెలకు సంబంధించిన పెన్షన్‌ను హోల్డ్‌లో వుంచి, వారు తిరిగి వచ్చిన తరువాత చెల్లిస్తామని అన్నారు. 14,967 మంది ఇతర జిల్లాలకు పెన్షన్ బదిలీ కోరారని, మరో 30,044 మంది ఒకే జిల్లాలో వుంటూ, ఇతర గ్రామాల్లో తాము వుంటున్న చోటికి పెన్షన్ ను బదిలీ చేయాలని కోరినట్లు తెలిపారు. అలాగే వివిధ కారణాల వల్ల గత ఆరు నెలల నుంచి పెన్షన్ తీసుకోలేని 1,52,095 మందికి చెల్లించాల్సిన బకాయిలు కూడా ఈ నెలలోనే అందచేస్తున్నామని అన్నారు.


fb twittar linkedin google+ pinterest


WRITE COMMENT

Name:
Phone/Email:
Comment: