మనబడి ,నాడు నేడు పనుల్లో తిరుపతికి 4 స్థానం
Published by:Admin, Date:30-07-2020:10:13

తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయం వైయస్సార్ సమావేశ మందిరం నందు గురువారం ఉదయం మనబడి: నాడు-నేడు పై నగర పాలక సంస్థ కమిషనర్ గిరీష మున్సిపల్ ఇంజినీర్లు, పాఠశాల ప్రధానోపాధ్యాయులతో మరియు తల్లిదండ్రుల కమిటీతో సమీక్ష సమావేశం నిర్వహించరు, పాఠశాల తెలిసేనాటికి మనబడి నాడు నేడు పనులు పూర్తవ్వాలని, పాఠశాలలో పండగ వాతావరణం, ఆహ్లాదకరంగా రంగులు, అవగాహన కలిగించే అందమైన బొమ్మలు ఉండాలని, అన్ని స్కూళ్లలో పండగ వాతావరణం కనిపించాలని, అన్ని స్కూల్ ఆహ్లాదకరంగా రంగులు ఉండాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు మనబడి : నాడు – నేడు చేపట్టే ప్రతి పనిలో నాణ్యత వుండాలని, తొమ్మిది అంశాలుతో పాఠశాల యందు ఆరు కోట్ల రూపాయల వ్యయంతో మొదటి విడత పాఠశాల అభివృద్ధి చేయాలని పేద విద్యార్థులకు చదువులకు కార్పొరేట్ స్థాయి పాఠశాలల దీటుగా ప్రభుత్వ పాఠశాల మెరుగుపరచాలని తెలియజేశారు,పాఠశాల జరుగుతున్న పనులు ప్రభుత్వం వారు ఆగస్టు 31వ తేదీ వరకు గడువు ఇచ్చింది గనుక మనము పదిహేను రోజులు లోపల పూర్తిచేయాలని మరియు ప్రతి స్కూల్లో ఇంటర్నెట్ కనెక్షన్ ఇవ్వాలని, స్కూల్స్ గోడలపై చక్కని బొమ్మలు కూడా వేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించిన కమిషనర్ . మనబడి : నాడు- నేడు పనులు 15 రోజులు లోపల పూర్తి చేయాలని, ఇంజనీరింగు, ప్రధానోపాధ్యాయులు ఇష్టంతో పనిచేయాలని మరియు పనులు జరిగే ప్రాంతాన్ని ఫొటోస్ తీయాలని ఎప్పటికప్పుడు తన దృష్టికి తీసుకురావాలని తెలియజేశారు. ప్రాధమికోన్నత పాఠశాలలు,నగర పాలక ఉన్నత పాఠశాలలు మొత్తం 44 స్కూల్స్ ఉన్నాయని మొదటి విడత 16 మున్సిపల్ పాఠశాలల్లో,6 జిల్లా పరిషత్ పాఠశాలలు మొత్తం 22 పాఠశాలలు జరుగుతున్న పనులన్నింటినీ ప్రభుత్వం వారు ఆగస్టు 31 వరకు గడిచింది గనుక మనము 15 రోజుల లోపల పూర్తి చేసి మన తిరుపతి ఆదర్శంగా నిలవాలని తెలియజేశారు మరియు కరోనా వైరస్ ప్రతిరోజు కేసులు ఎక్కువ అవుతున్న తరుణంలో జాగ్రత్త వహించాలని, భౌతిక దూరం, మాస్కులు, చేతికి గ్లౌజులు వుండలని మరియు ప్రతి హెచ్ఎంలు( స్కూల్ ట్రాన్స్ఫర్ రేషన్ మానిటరింగ్ సిస్టం యాప్) ఎస్ టి ఎం ఎస్ యాప్ డౌన్లోడ్ చేసి ఎప్పటికి అప్పుడు ఫోటోలు అప్లోడ్ చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో కమిషనర్ వారితొపాటు ఇంచార్జ్ సూపర్డెంట్ ఇంజనీర్ చంద్రశేఖర్, మున్సిపల్ ఇంజనీర్ వెంకట్రాంరెడ్డి, డివైఈవో జనార్దన్ రెడ్డి, స్కూల్ సూపర్వైజర్లు ప్రభు కుమార్, లక్ష్మీదేవి, నగరపాలక సంస్థ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు చంద్రశేఖర్ రెడ్డి, రఘు కుమార్, రవీంద్రనాథ్ రెడ్డి,గోమతి,దేవిక,ఏఈలు శంకర్ రెడ్డి, తేజస్విని, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, తల్లిదండ్రుల కమిటీ తదితరులు పాల్గొన్నారు.


fb twittar linkedin google+ pinterest

WRITE COMMENT

Name:
Phone/Email:
Comment: