హిందీ ,కన్నడ భాషల్లో ఎస్వీబీసీ ప్రసారాలు :టిటిడి బోర్డు చైర్మన్ వై వి సుబ్బారెడ్డి
Published by:Admin, Date:30-07-2020:10:16

శ్రీ వేంకటేశ్వ‌ర భ‌క్తి ఛాన‌ల్ బోర్డు స‌మావేశం గురువారం తిరుమ‌ల‌లోని అన్న‌మ‌య్య భ‌వ‌నంలో జ‌రిగింది. బోర్డు ఛైర్మ‌న్ శ్రీ వైవి.సుబ్బారెడ్డి అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన ఈ స‌మావేశంలో తీసుకున్న ముఖ్య నిర్ణ‌యాలు ఇలా ఉన్నాయి. - పిల్ల‌లు, యువ‌త‌లో ధార్మిక‌త‌ను పెంపొందించేలా కార్య‌క్ర‌మాలు రూపొందించి ప్ర‌సారం చేయాలి.‌ - ఎస్వీబీసీని యాడ్ ఫ్రీ ఛానెల్ గా మార్చాలని నిర్ణయం. - ఎస్వీబీసీ ట్రస్టుకు విరాళాలు స్వీకరిస్తాం. - త్వరలోనే దేశవ్యాప్తంగా హిందీ, కన్నడ భాషల్లో ఎస్వీబీసీ ప్రసారాలు చేయాలని నిర్ణయం. - త్వరలో తిరుమ‌ల‌లోని నాద‌నీరాజ‌నం వేదిక‌పై శ్రీ‌మ‌ద్భ‌గ‌వ‌ద్గీత, గరుడ పురాణం పారాయ‌ణం ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేసేందుకు నిర్ణయం. - ప్ర‌స్తుతం సుంద‌ర‌కాండ పారాయ‌ణానికి విశేష స్పంద‌న వ‌స్తోంద‌ని, విరాట‌ప‌ర్వ పారాయ‌ణం ఆక‌ట్టుకుంటోంద‌ని, ఇలాంటి లైవ్ కార్య‌క్ర‌మాలు మ‌రిన్ని రూపొందించ‌డంపై చ‌ర్చించారు. - శ్రీవారి కళ్యాణోత్సవ సేవ త్వరలోనే ఆన్ లైన్ లో నిర్వహణ. - కళ్యాణోత్సవ టికెట్లు కొనుగోలు చేసిన భక్తుల ఇళ్లకు శ్రీవారి ప్రసాదం, అక్షింతలు తదితరాలు పంపే ఏర్పాటు. ఈ స‌మావేశంలో టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్‌, ఎస్వీబీసీ ఎండి శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి, ఎఫ్ఏ,సిఏవో శ్రీ ఓ.బాలాజి, బోర్డు స‌భ్యులు శ్రీ‌మ‌తి స్వ‌ప్న‌, శ్రీ శ్రీ‌నివాస‌రెడ్డి, సిఈవో శ్రీ వెంక‌ట‌న‌గేష్ పాల్గొన్నారు.


fb twittar linkedin google+ pinterest

WRITE COMMENT

Name:
Phone/Email:
Comment: