శ్రీ‌వాణి ట్ర‌స్టు ద‌ర్శ‌నం టికెట్ల‌ కాల ప‌రిమితి పెంపు ‌
Published by:Admin, Date:30-07-2020:10:22

తిరుమ‌ల శ్రీ‌వారిని ద‌ర్శించుకునేందుకు శ్రీ‌వాణి ట్ర‌స్టు ద్వారా బ్రేక్ టికెట్లు పొందిన భ‌క్తుల సౌక‌ర్య‌ర్థం ఒక సంవ‌త్స‌రంలోపు స్వామివారిని దర్శించుకునే అవ‌కాశం టిటిడి కల్పించింది. ప్ర‌పంచ ‌వ్యాప్తంగా క‌రోనా వైర‌స్ విస్తృతంగా వ్యాప్తి చెందుతున్న‌ నేప‌థ్యంలో భ‌క్తుల విజ్ఞ‌ప్తి మేర‌కు శుక్ర‌వారం నుండి శ్రీ‌వాణి ట్ర‌స్టు ద్వారా రూ. 10 వేలు చెల్లించి టికెట్లు పొందిన భ‌క్తుల ద‌ర్శ‌న కాలాన్ని ప్ర‌స్తుతం ఉన్న 6 నెల‌ల కాల ప‌రిమితిని సంవ‌త్స‌రా‌నికి టిటిడి పెంచ‌డ‌మైన‌ది. ఇదివ‌ర‌కే ఆన్‌లైన్‌లో శ్రీ‌వాణి ట్ర‌స్టు ద్వారా టికెట్లు బుక్ చేసుకున్న భ‌క్తులు సంవ‌త్స‌రంలోపు వినియోగించుకోవ‌ల‌సి ఉంటుంది. కావున ఈ విష‌యాన్ని భ‌క్తులు గ‌మ‌నించ‌గ‌ల‌రు.


fb twittar linkedin google+ pinterest

WRITE COMMENT

Name:
Phone/Email:
Comment: