నిమ్మగడ్డ పదవి కాలం 8నెలలు ?
Published by:Admin, Date:31-07-2020:01:07

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ నునియమిస్తూ గురువారం రాత్రి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది .గత రెండు నెలలుగా నడుస్తున్న సస్పెన్స్ కుతెర వేసింది .అయితే ఈ నియామకం కూడా సుప్రీంకోర్టులో ప్రస్తుతం నడుస్తున్న కేసు తీర్పు కులోబడి ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొంది .ఆలస్యంగానైనా ఉత్తర్వులు జారీ చేయడం మంచిదేనని అభిప్రాయం వినిపిస్తుంది .నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవి కాలంఎనిమిది నెలలో ముగిస్తుంది .1982 ఐఏఎస్ బ్యాచ్ కుచెందిన నిమ్మగడ్డ గతంలో గవర్నర్ వద్ద చీఫ్ సెక్రటరీగా పని చేశారు .తిరుమల తిరుపతి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా పని చేశారు .పదవి కాలం తక్కువగా ఉండటంతో పాటు కరోనా విలయతాండవం చేస్తున్న వేళ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయో చెప్పలేని పరిస్థితి ఈ నేపథ్యంలో పంతాలు, పట్టింపులకు పోకుండా నిమ్మగడ్డ రమేష్ కుమార్ నుఎన్నికల కమిషనర్ గా నియమించడం ఐఏఎస్ వర్గాలు కూడా స్వాగతిస్తున్నాయి .ఇప్పటివరకు జరిగిన ఏకగ్రీవం ఎన్నికలు యథాతథంగా ఉంటాయని నామినేషన్లు దాఖలు చేసిన వారికే ఎన్నికలు జరుగుతాయని గతంలోని నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రకటించి ఉన్నారు .ఈ నేపథ్యంలో ఎన్నికల కమిషనర్ గాబాధ్యతలు స్వీకరించ బోతున్న ఆయన ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు అనేది ఆసక్తిగా మారింది .పార్క్ హయత్ హోటల్ సంఘటన నేపథ్యంలో రాజకీయ వాసనలు లేకుండా నడుచుకోవాలని పలువురు కోరుతున్నారు


fb twittar linkedin google+ pinterest


WRITE COMMENT

Name:
Phone/Email:
Comment: