చంద్రబాబుకు అతి పెద్ద షాక్ ఇవ్వబోతున్న జగన్ ..?
Published by:Admin, Date:31-07-2020:02:47

ఆంధ్రప్రదేశ్ లోమూడు రాజధానులు ,సి ఆర్ డి ఎ బిల్లు రద్దు పై గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తిగా మారింది .గవర్నర్ వద్ద రెండు ప్రధాన అంశాలు పెండింగ్ లో ఉండగా హైకోర్టు ఆదేశాల ప్రకారం నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను ఎన్నికల కమిషనర్ గా నియమించాలని గవర్నర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించడం ఆలస్యంగానైనా నిమ్మగడ్డను ఎన్నికల కమిషనర్ గా గురువారం రాత్రి నియమిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది .ఈ నేపథ్యంలో రెండో ప్రధానమైన అంశం మూడు రాజధానులు ,సీఆర్డీఏ రద్దు బిల్లుపై గవర్నర్ నుండి తీపి కబురు వస్తుందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వర్గాలు ,ప్రభుత్వ గట్టి నమ్మకంతో ఉంది .ఇటీవల ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తో సమావేశమయ్యారు .ఈ బిల్లుపై చర్చించినట్లు సమాచారం .గవర్నర్ సానుకూలంగా స్పందించినట్లు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది .కోర్టు నుంచి ఎటువంటి ఆదేశాలు లేకపోవడం ,కేంద్ర ప్రభుత్వం ఏపీ రాజధాని విషయంలో జోక్యం చేసుకోదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేయడం నేపథ్యంలో అన్ని మార్గాల నుంచి ఆరా తీస్తున్న గవర్నర్ ఏ క్షణంలోనైనా కీలక నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది .గవర్నర్ నుంచి వచ్చే సానుకూల నిర్ణయం తో ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు అండ్ కో బ్యాచ్ కిముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పెద్ద షాక్ ఇవ్వబోతున్న రని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు


fb twittar linkedin google+ pinterest

WRITE COMMENT

Name:
Phone/Email:
Comment: