ముందే మోగనున్న 'గంటా '
Published by:Admin, Date:31-07-2020:06:46

విశాఖ నార్త్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ముహూర్తం ఖరారైంది .ఆగస్టు 9న ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరతారని ఆయన అభిమానులు చెబుతున్నారు .తొలి త ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవం రోజు రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షల ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం జరగనుంది ఆ వేదిక ద్వారా ఆయన వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో అనధికారికంగా చేరతారని ఇదివరకు అనుకున్నారు .తాజాగా విశాఖను పరిపాలన రాజధాని నిర్ణయానికి గవర్నర్ ఆమోదముద్ర వేయడంతో హర్షం వ్యక్తం చేస్తున్న ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అనుకున్న సమయం కంటే ముందే పార్టీలో చేరడానికి నిర్ణయించుకున్నట్లు సమాచారం .దీనికి ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆమోద ముద్ర వేసినట్లు తెలిసింది .గంటా రాకను వ్యతిరేకిస్తున్న ఎంపీ విజయసాయిరెడ్డి ,మంత్రి అవంతి శ్రీనివాస్ తదితరులు కూడా సముఖత వ్యక్తం చేసినట్లు పార్టీలో ప్రచారం జరుగుతోంది


fb twittar linkedin google+ pinterest


WRITE COMMENT

Name:
Phone/Email:
Comment: