చంద్రబాబుకు కొడాలి నాని సవాల్
Published by:Admin, Date:01-08-2020:12:53

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు దమ్ము ధైర్యం ఉంటే తన వద్ద ఉన్న 20 మంది ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్లాలని ఆ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో విజయం సాధిస్తే రాజధాని వికేంద్రీకరణ పై ఆలోచిస్తామని మంత్రి కొడాలి నాని సవాల్ విసిరారు ఒకవేళ ఓడిపోతే ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి మద్దతు తెలపాలని కోరారు .శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ చంద్రబాబుగత ప్రభుత్వ నిర్ణయాలు పిచ్చి తుగ్లక్ లాగా ఉన్నాయని అందుకే ప్రజలు చిత్తుచిత్తుగా ఓడించాలని ఫైర్ అయ్యారు .రాజధాని ప్రాంతంలో లోకేష్ కూడా చిత్తు చిత్తుగా ఓడిన విషయం మరిచిపోయారా అని ప్రశ్నించారు .ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అన్ని ప్రాంతాలనూ అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో భవిష్యత్తులో ఎటువంటి విభజన ఉద్యమాలు రాకూడదని ముందుచూపుతో అన్ని ప్రాంతాల అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో చిత్తశుద్ధితో పని చేస్తా ఉంటే విమర్శించడం తగదన్నారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా లక్ష కోట్లు పెట్టి ఒకే చోట అభివృద్ధి చేయడం సాధ్యం కాదని 10శాతం నిధులతో వైజాగ్ అభివృద్ధి అవుతుందని చెప్పారు .చంద్రబాబునాయుడుకు ప్రజల్లో మద్దతు ఉంటే తన ఎమ్మెల్యే చేత రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్లాలన్నారు


fb twittar linkedin google+ pinterest

WRITE COMMENT

Name:
Phone/Email:
Comment: