భారత్ బాటలో అమెరికా .....టిక్ టాక్ బ్యాన్ ....
Published by:Admin, Date:01-08-2020:01:08

చైనా పై ప్రతీకారంలో భాగంగా డిజిటల్ స్ట్రైక్ కి దిగి చైనా కి చెందిన టిక్ టాక్ తో పాటు 59 యాప్స్ ను పూర్తిగా నిషేధించింది. అయితే భారత్ తీసుకున్న నిర్ణయం సరైందే అంటూ అమెరికా కూడా భారత్ బాటలో నడుస్తునట్లు అనిపిస్తుంది. అతి తక్కువ సమయంలోనే ప్రపంచ వ్యాప్తంగా పాపులారిటీ సంపాదించుకున్న టిక్ టాక్ ను నిషేధించే యోచనలో ఉంది. టిక్ టాక్ పై నిషేధం విధించే దిశగా తన యంత్రాంగం పరిశీలన చేస్తోందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. టిక్ టాక్ ను నిషేదిస్తే దానికి ప్రత్యామ్నాయాన్ని కూడా కనుగొనే ప్రయత్నాల్లో ఉన్నట్లు వెల్లడించారు. ఈ తరుణంలో మరికొన్ని వార్తలు మైక్రోసాఫ్ట్ టిక్ టాక్ ను సొంతం చేసుకునే ఆలోచనలో ఉందంటూ కొన్ని న్యూస్ చానల్స్ కథనం ప్రచురిస్తున్నాయి. ఇందుకు సంబంధించిన చర్చలు సోమవారం ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉందని బిలియన్ డాలర్లతో కూడిన ఒప్పందం గురించి మైక్రోసాఫ్ట్ శ్వేతసౌధం తో కూడా సంప్రదింపులు జరిపినట్లు వినికిడి. టిక్ టాక్ బ్యాన్ విషయాన్నీ అమేరికా విదేశాంగ కార్యదర్శి మైక్ పాంపియో జూలై నెల ప్రారంభంలో చెప్పిన సంగతి విదితమే.


fb twittar linkedin google+ pinterest

WRITE COMMENT

Name:
Phone/Email:
Comment: