ప్లాప్ షోకు 227 రోజులు
Published by:Admin, Date:01-08-2020:02:14

అమరావతి రాజధాని కొనసాగించాలని తెలుగుదేశం పార్టీ తెరవెనుక అమరావతి రైతుల పేరుతో దీక్షలు, ధర్నాలు చేశారు .దాదాపుగా 227 రోజులు దీక్షలు కొనసాగాయి .ఈ దీక్షల వెనుక అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల్లో పెట్టుబడులు పెట్టిన తెలుగుదేశం పార్టీ నాయకులు దీక్షలకు ఆర్థికంగా సహాయం చేస్తూ వెన్నుదన్నుగా నిలిచినట్లు ఆరోపణలు ఉన్నాయి .దీంతో ఇంత కాలం కొనసాగిన దీక్షలు వృధా అయ్యాయి .ఇటీవల మాజీ ఎంపీ జెసి దివాకర్ రెడ్డి సైతం అమరావతిలో పేరుతో దీక్షలు వలన ఎటువంటి ఉపయోగం ఉండదని అప్పట్లోనే తెలుగుదేశం పార్టీ నాయకులవైఖరిని ఎండగట్టారు .అమరావతి ప్రాంత రైతులు నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసికోట్లు కొట్టేద్దామని ప్రయత్నించిన తెలుగుదేశం పార్టీ నాయకులకు వికేంద్రీకరణ బిల్లు నోట్లో పచ్చి వెలక్కాయ పడినట్లయింది .రైతుల పేరుతో కొంతమంది పెయిడ్ ఆర్టిస్ట్ లను దీక్షలో కూర్చున్న పెట్టిన నాయకులు ఆడిన నాటకాలకు తడ పడిందని పలువురు అంటున్నారు .వారు ఎంత ప్రయత్నం చేసిన 29 గ్రామాల నుంచి బయటకు రాలేక పోయారు .బిల్లును అడ్డుకోవడం కోసం చంద్రబాబు నాయుడు యనమల రామకృష్ణుడు చేత గవర్నర్ కులేఖలు రాయించాడు .తప్పని పరిస్థితుల్లో తానే లేఖ రాశాడు తన అనుచరులు చేత కోర్టు కేసులు వేయించాడు చివరకు తెలుగుదేశం పార్టీ కోవర్ట్ అయినా సుజనా చౌదరి రంగంలోకి దిగిబిజెపి నిర్ణయానికి వ్యతిరేకంగా మాట్లాడి పరువు పోగొట్టుకున్నాడు ఎంత ప్రయత్నించినా మూడు రాజధానులు ,సీఆర్డీఏ రద్దు బిల్లు ఆగలేదు .ఈ నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీ నాయకులు నిరసన తెలుపుతుండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్ని ప్రాంతాల అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తీసుకొన్ననిర్ణయం సముచితమని వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు.పోటాపోటీగా ఒకపక్క నిరసన మరోపక్క హర్షం వ్యక్తం అవుతోంది


fb twittar linkedin google+ pinterest

WRITE COMMENT

Name:
Phone/Email:
Comment: