మాజీ మంత్రి ని బలితీసుకున్న కరోనా
Published by:Admin, Date:01-08-2020:06:11

దేవాదాయ శాఖ మాజీ మంత్రి భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు పైడికొండల మాణిక్యాలరావు శనివారం కరోనా కారణంగా మృతి చెందారు .ఆయన వయస్సు 60 సంవత్సరాలు పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన మాణిక్యాలరావు కుఇటీవలనే కరోనా సోకింది .దీనిపై ఆయన వీడియో విడుదల చేస్తూ కరోనా గురించి భయపడాల్సిన అవసరం లేదని ధైర్యంగా ఎదుర్కోవాలని ఆయన పిలుపునిచ్చారు .ఇటీవలనే ఆయనకు సీరియస్ గా ఉందని ప్రచారం జరిగిన దానిని ఆయన ఖండించారు శనివారం విజయవాడ లోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు .2014 ఎన్నికల్లో విజయం సాధించిన 2018 వరకు మంత్రిగా పని చేశారు .పైడికొండల మాణిక్యాలరావు మృతికి ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి,సంతాపం వ్యక్తం చేశారు .ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు మాజీ మంత్రికి అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ ను ఆదేశించారు .మాణిక్యాలరావు మృతికి బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజు సంతాపం వ్యక్తం చేశారు ఆర్ ఎస్ ఎస్ లో చురుగ్గా పని చేసిన ఆయన బిజెపిఅభివృద్ధికి ఎంతో చేశారని ఆయన మృతి పార్టీకి తీరని లోటు అన్నారు .జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒక ప్రకటనలో మాణిక్యాలరావు మృతిపై తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు .


fb twittar linkedin google+ pinterest

WRITE COMMENT

Name:
Phone/Email:
Comment: