తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల రాజీనామా ..?
Published by:Admin, Date:01-08-2020:09:00

మూడు రాజధానులు ,సి ఆర్ డి ఎ రద్దు బిల్లును గవర్నర్ విశ్వ భూషణ్ హరిచందన్ ఆమోద ముద్ర వేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద చర్చనీయాంశంగా మారింది ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ దీనిపై సీరియస్ గా ఆలోచిస్తుంది .మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ నాయకులు ,ఎమ్మెల్యేలు తోను సీరియస్ గా చర్చిస్తున్నట్లు సమాచారం .గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోటిఆర్ఎస్ పార్టీ ప్రత్యేక తెలంగాణ కి అనుకూలంగా పలు సార్లు రాజీనామా చేసి ప్రజల ముందుకు వెళ్ళింది .అదే తరహాలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి తాజా తీర్పు కోరితే ఎలా ఉంటుంది అనే చర్చ జరుగుతోంది .తెలుగుదేశం పార్టీకి ప్రధానంగా 20 మంది ఎమ్మెల్యేలు ప్రస్తుతం పార్టీకి అందుబాటులో ఉన్నారు .విశాఖ నార్త్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పార్టీ మారతారని ప్రచారంలో ఉంది .దీంతో 19 మంది మిగులుతారు .వారిలో ఎంతమంది రాజీనామాకు ముందుకు వస్తారు ఏ ఏ ప్రాంతాల్లో ప్రజల్లో అభిప్రాయం ఎలా ఉంది ఆరా తీస్తున్నట్లు సమాచారం ప్రస్తుతం జిల్లాల వారీగా తెలుగుదేశం పార్టీకి అందుబాటులో ఉన్న ఎమ్మెల్యేల సంఖ్య ఇలా ఉంది .విశాఖపట్నం 4 ,ప్రకాశం3 ,తూర్పుగోదావరి4కృష్ణ 1,శ్రీకాకుళం 2 అనంతపురం2 ,పశ్చిమ గోదావరి 2,చిత్తూరు 1,గుంటూరు 1చొప్పున ఎమ్మెల్యేలు ఉన్నారు .నెల్లూరు ,విజయనగరం ,కడప ,కర్నూలు ప్రాతినిధ్యమే లేదు .ఈ నేపథ్యంలో ఎన్నికలు జరిగితే ఫలితాలు ఎలా ఉంటాయి అనే చర్చ జరుగుతోంది .వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడంతో తెలుగుదేశం పార్టీ భయపడుతుంది .అదే సందర్భంలో ఎన్నికల కమిషనర్ గా రమేష్ కుమార్ ఉండడంతో పరిస్థితి కలిసివస్తుందా ?ఇలా అన్ని కోణాల్లో ఆలోచిస్తున్నట్లు సమాచారం .రాజీనామాపై తొందర పడితే గెలవకపోతే తెలుగుదేశం పార్టీ పరిస్థితి మరింత క్షీణిస్తుందని సమాలోచనలు జరుపుతున్నట్లు తెలిసింది .అమరావతి పై రిఫరెండం తో ప్రజల ముందుకు వెళితే ఫలితాలు ఎలా ఉంటాయి అని అనేక కోణాల్లో పార్టీ ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్నట్లు సమాచారం శనివారం ఉదయం రాజీనామా నిర్ణయం ప్రకటిస్తారని ప్రచారం జరిగింది .మళ్లీ పునరాలోచనలో పడినట్లు సమాచారం


fb twittar linkedin google+ pinterest

WRITE COMMENT

Name:
Phone/Email:
Comment: