దర్శకుడు తేజకు కరోనా పాజిటివ్.
Published by:Admin, Date:03-08-2020:05:22

ప్రజల తో పాటు అధికారులు, ప్రజాప్రతినిధులు,సినిమా ఇండస్ట్రీకి చెందినవారు సైతం కరోనా భారిన పడటం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే పలువురు ప్రజాప్రతినిధులు, సినీ ఇండస్ట్రీకి చెందినవారు కరోనా తో ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. ఇక ఇటీవలే టాలీవుడ్ దర్శకుడు రాజమౌళి సైతం కరోనా భారిన పడి హోమ్ ఐసోలేషన్ లో చికిత్స తీసుకుంటున్నారు. రాజమౌళితో పాటు ఆయన కుటుంబసభ్యులకు సైతం కరోనా పాజిటివ్ వచ్చింది. ఇక తాజాగా మరో టాలీవుడ్ దర్శకుడు కరోనా భారినపడ్డారు. ప్రముఖ దర్శకుడు తేజ ప్రస్తుతం ఒక వెబ్ సిరీస్ ను తెరకెక్కిస్తున్నారు. అయితే ఆ యూనిట్ సబ్యులకు కరోనా పరీక్షలు నిర్వహించగా తేజ కు కరోనా పాజిటివ్ వచ్చింది. ఆయన కుటుంబ సభ్యులు మరియు యూనిట్ సభ్యులందరికీ నెగిటివ్ వచ్చింది. దాంతో ప్రతుతం తేజ హోమ్ ఐసోలేషన్ లో చికిత్స తీసుకుంటున్నారు.


fb twittar linkedin google+ pinterest





WRITE COMMENT

Name:
Phone/Email:
Comment: