అయోధ్యలో శ్రీరామ మందిరానికి పునాది
Published by:Admin, Date:05-08-2020:01:36

హిందువులు ఎన్నో దశాబ్దాలుగా వేచిన అపూర్వ ఘట్టం నేడు ఆవిష్కృతం అయ్యింది.. శ్రీరామచంద్రుడు పుట్టి పెరిగిన చారిత్రక, పురాణ పుణ్య భూమి దివ్య కాంతులతో వెల్లి విరుస్తోంది. అయోధ్య లో శ్రీరాముడి దివ్యాలయానికి భూమి పూజ జరిగింది. ఆలయ నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోదీ వెండి ఇటుక తో పునాది రాయి వేసారు. మధ్యాహ్నం 12 గంటల 44 నిమిషాల 8 సెకన్ల నుంచి 12 గంటల 44 నిమిషాల 40 సెకన్ల దాకా.. అంటే 32 సెకన్ల లోపు ఈ కార్యక్రమం నిర్వహించారు. అయోధ్యా శ్రీరామ మందిర నిర్మాణం పై ప్రపంచం మొత్తం దృష్టి సారించింది. సామాన్య‌లు, సెల‌బ్రిటీ లు కూడా ఇదొక అద్భుత క్ష‌ణం అని కొనియాడుతున్నారు. అయోధ్య రాముడు ఆనందించేలా, భారతదేశం గర్వించేలా, ప్రపంచ చరిత్ర చెప్పుకునేలా, ఎదురు లేని తిరుగు లేని మొక్కవోని సాహసం తో, పుణ్య కారం తల పెట్టిన పుణ్యాత్ములందరికీ, శ‌తథా సహస్ర థా.. వందనం..


fb twittar linkedin google+ pinterest

WRITE COMMENT

Name:
Phone/Email:
Comment: