భోజనం సరిగా పెట్టకపోతే కాంట్రాక్టర్ మారుస్తా
Published by:Admin, Date:06-08-2020:04:36

కరోనా టెస్టుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని అన్నారు .గురు వారం సిమ్స్ ఆడిటోరియంలో కరోన నివారణ పై సమీక్ష సమావేశం జరిగింది ఈ సమావేశంలోడిప్యూటీ సీఎం నారాయణస్వామి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ,ఎమ్మెల్యేలు భూమన కరుణాకర్ రెడ్డి ,ఆర్ కే రోజా కలెక్టర్ నారాయణ భరత్ గుప్తా తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి కరోన నివారణ కోసం మారుమూల ప్రాంతాలకు సంజీవని బస్సు పంపుతూ టెస్టులు చేయిస్తున్నారని ఇన్ని వందల కోట్లు ఖర్చు అయినా భరిస్తామని వెనకడుగు వేయమని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చినట్లు ఆయన తెలిపారు .కరోనా నివారణ కోసం ప్రతి నెల 350 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పారు అన్ని జిల్లాల్లో కోవిడ్ సెంటర్ లలోహాస్పిటల్లో రోగులకు అందుతున్న సేవలను స్వయంగా తెలుసుకోవడం కోసం అన్ని జిల్లాల తిరుగుతున్నట్లు ఆయన తెలిపారు .తన పర్యటనలో డాక్టర్లు, వైద్య సిబ్బందిపారిశుద్ధ్య సిబ్బంది సేవలు సంతృప్తికరంగా ఉన్నాయని చెప్పారు .వారు చేస్తున్న సేవలకు చేతులెత్తి నమస్కరిస్తున్నారు.హాస్పిటల్లో భోజనం సరిగా అందించకపోతే కాంట్రాక్టర్లు మారుస్తామని చెప్పారు .కరోనా రోగాలకు అరగంటలోనే బెడ్ కేటాయిస్తామని చెప్పారు అత్యాధునిక సౌకర్యాలతో పాటు సేవలు అందిస్తున్నామని ఆయన అన్నారు


fb twittar linkedin google+ pinterest

WRITE COMMENT

Name:
Phone/Email:
Comment: