చంద్రబాబు కు బినామీల ఆస్తుల విలువ ముఖ్యం
Published by:Admin, Date:06-08-2020:05:28

చంద్రబాబు నాయుడు పనికిమాలిన సవాళ్ళు చేస్తూ.. తన పార్టీ పోయినా, ఎమ్మెల్యేలు, ఎంపీలు పోయినా ఫరవాలేదుగానీ తన సామాజికవర్గం, తన బినామీలు మాత్రం బాగుపడాలని, అమరావతిలో తన ఆస్తులు, తన బినామీల ఆస్తులే ముఖ్యం అన్నట్టుగా వ్యవహరిస్తున్నాడని మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. "ఎమ్మెల్యేలు పోయినా ఫర్వాలేదు.. అమరావతిలో బినామీ భూముల, ఆస్తుల విలువే ముఖ్యం అంటున్నాడు చంద్రబాబు. ఇప్పుడు చంద్రబాబుకు 70 ఏళ్ళు. 71లోకి వచ్చాడు. ఇంతకాలం రాజకీయాల్లో ఉండి సాధించింది ఏమీ లేదు. ఇకమీదట సాధించేదేమీ లేదు. కాబట్టి, పదవులపై, అధికారంపై ఆశలు వదులుకుని తనకు డబ్బే ముఖ్యమని అల్టిమేటం ఇచ్చాడు. 20 మంది ఎమ్మెల్యేలా..? లేక.. లక్ష కోట్లా.. ? అన్న ప్రశ్నకు ఎమ్మెల్యేలను వదులుకుంటానంటున్నాడు. బాబుకు డబ్బే ముఖ్యం.. బాబుకు తన ఆస్తులు ముఖ్యం. వాటి రేట్లు ముఖ్యం. వాటి కోసం తన ఎమ్మెల్యేలని, ఎంపీలని కూడా ఫణంగా పెట్టటానికి సిద్ధపడ్డాడు..." అని బొత్స అన్నారు. చంద్రబాబుకు తనపై తనకు నమ్మకం వుంటే... తన మాటలను ప్రజలు నమ్ముతున్నారని అనుకుంటే... రాజీనామా చేసి ప్రజల్లోకి రావాలని మంత్రి బొత్స సత్యనారాయణ సవాల్ చేశారు. "చంద్రబాబుకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమైతే.. మరి 2014లో రాష్ట్ర విభజన జరుగుతున్నప్పుడు ఈ డెడ్ లైన్లు ఎందుకు పెట్టలేదు?. హైదరాబాద్ వదులుకుని వస్తున్నప్పుడు ఆయన మనసు ఎందుకు చలించలేదు?. రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం కాదు.. తన రియల్ ఎస్టేట్ ప్రయోజనాలు ముఖ్యమని చంద్రబాబు స్పష్టంగా చెబుతున్నాడు. ఇటువంటి మనిషిని రాజకీయాల్లో ఉండనివ్వవచ్చా..? ఇటువంటి మనిషిని ఉత్తరాంధ్రలో అయినా, రాయలసీమలో అయినా, చివరికి కృష్ణా జిల్లాలో అయినా అడుగు మోపనివ్వవచ్చా..? నిజానికి ఆయన ప్రేమ అమరావతి మీద కాదు.. "ధనావతి" మీద."అని మంత్రి బొత్స సత్యనారాయణ ఘాటుగా విమర్శించారు. ఈ రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాలుగా వున్న ఉత్తరాంధ్ర, రాయలసీమలు కూడా అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరుకుంటున్నామని అన్నారు. పదమూడు జిల్లాల్లో అందరికీ న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై వుందని, ఏ ఒక్క సామాజికవర్గంకో ప్రభుత్వం పరిమితం కాకూడదని అన్నారు. ప్రతిపక్షనేతగా చంద్రబాబు మాట్లాడిన భాష, ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రజలకు అభివృద్ధి అవసరం లేదనే విధంగా వుందని అన్నారు. రాష్ట్రం మొత్తం 29 గ్రామాలే అని చంద్రబాబు అనుకుంటున్నాడా? అని బొత్స ప్రశ్నించారు. అయిదేళ్ళ తన పాలనతో ఎపిని ఇరవై ఏళ్ళు వెనక్కి నెట్టిన చంద్రబాబు.. ఇప్పుడు సిగ్గు లేకుండా పరిపాలన వికేంద్రీకరణను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాడని, పనికిమాలిన సవాళ్ళు విసురుతున్నాడని బొత్స సత్యనారాయణ మండిపడ్డారు.


fb twittar linkedin google+ pinterest

WRITE COMMENT

Name:
Phone/Email:
Comment: