'కాపు 'కాస్తున్న బిజెపి
Published by:Admin, Date:06-08-2020:07:10

ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు గురువారం మెగాస్టార్ చిరంజీవి నిఆయన నివాసంలోమర్యాదపూర్వకంగా కలిశారు .ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి సోము వీర్రాజు ను సత్కరించి అభినందనలు తెలియజేశారు .ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తో కలిసి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని 2024 ఎన్నికల్లో బిజెపి జనసేన కూటమి విజయం సాధించడానికికృషి చేయాలని కోరారు .సోము వీర్రాజు బిజెపి అధ్యక్షుడు అయినప్పటి నుంచి స్పష్టమైన విధానాలతో ముందుకు వెళ్తున్నారు . రాజధాని పై క్లారిటీ ఇచ్చారు .వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ,తెలుగుదేశం పార్టీ లకు ప్రత్యామ్నాయంగా బిజెపి జనసేన కూటమిని బలోపేతం కావడం కోసం ముఖ్యంగా కాపు సామాజిక వర్గం ఓటు బ్యాంక్ తమవైపు తిప్పుకోవడం కోసం చిరంజీవిని కలిసినట్లు ప్రచారం జరుగుతోంది .త్వరలోనే సోము వీర్రాజు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నికూడా కలిసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి


fb twittar linkedin google+ pinterest

WRITE COMMENT

Name:
Phone/Email:
Comment: