ఎమ్మెల్యే శ్రీదేవి పై ప్రశంసల వర్షం
Published by:Admin, Date:06-08-2020:08:13

తాడికొండ వైఎస్సార్ సీపీ మహిళా ఎమ్మెల్యే తన మానవత్వాన్ని చాటుకున్నారు. స్వతహాగా డాక్టర్ అయిన ఆమె తన వృత్తి ధర్మాన్ని పాటించారు. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి, కొన ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న ఓ వ్యక్తికి అప్పటికప్పుడు, నడి రోడ్డు మీదే ప్రధమ చికిత్స చేశారు. ఆమే తాడికొండ శాసన సభ్యురాలు, వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి. గురువారం సాయంత్రం ఆమె గుంటూరు నుంచి పిడుగురాళ్ళ మీదగా వెళ్తుండగా పిడుగురాళ్ల వద్ద ఓ ప్రమాదం జరిగింది. అనుకోకుండా లారీ, ద్విచక్ర వాహనం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బైక్ పై ఉన్న వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. కరోనా భయంతో అక్కడ ఉన్న స్థానికులు సైతం గాయపడిన వ్యక్తి వద్దకు వెళ్లే కనీస ప్రయత్నం చేయలేదు. స్వతహాగా వైద్యురాలయిన శ్రీదేవి హుటాహుటిన తన వాహనంలో నుంచి దిగి పరుగుపరుగున గాయపడిన వ్యక్తి దగ్గరకు చేరుకుని చేతి గ్లోవ్స్, మాస్కు ధరించి నాడి చూశారు. నాడి కొట్టుకోవడం గమనించిన ఎమ్మెల్యే శ్రీదేవి వెంటనే ప్రథమ చికిత్స అందించారు. అనంతరం దగ్గర్లో ఉన్న పోలీసులు సమాచారం ఇవ్వగా పోలీస్ పెట్రోలింగ్ వాహనం వచ్చింది. స్థానికులు ఆ వ్యక్తిని పోలీస్ పెట్రోలింగ్ వాహనంలోకి ఎక్కించారు. ఘటన జరిగిన అనంతరం ఎమ్మెల్యే శ్రీదేవి స్థానికులతో మాట్లాడుతూ ప్రమాదంలో ఉన్న వ్యక్తిని ఆదుకోవాలని అలా చూస్తూ ఉండడం సరైన విధానం కాదు అన్నారు. కరోనా భయం ఉంటే తగిన జాగ్రత్తలు తీసుకొని పరిశీలించాలని తెలియజేశారు. అయితే తన పని కాదనుకోకుండా మానవత్వంతో ప్రాణాలు కాపాడిన ఎమ్మెల్యే శ్రీదేవికి మీద ప్రసంశల వర్షం కురిపిస్తున్నారు


fb twittar linkedin google+ pinterest

WRITE COMMENT

Name:
Phone/Email:
Comment: