టీడీపీకి షాక్ ఇచ్చిన కేంద్రం ..?
Published by:Admin, Date:06-08-2020:09:25

ఆంధ్ర ప్రదేశ్ లో మూడు రాజధానుల అంశంపై కేంద్ర ప్రభుత్వం తెలుగుదేశం పార్టీకి భారీ షాక్ ఇచ్చింది .రాజధాని అంశంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని టీడీపీ డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్రం ఆ పార్టీకి భారీ షాకిచ్చింది. రాజధాని అంశంలో తుది నిర్ణయం రాష్ట్ర పరిధిలోనిదా? లేక కేంద్ర పరిధిలోనిదా? అనే విషయంలో కేంద్ర ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. ఈ మేరకు ఏపీ హైకోర్టులో కేంద్ర హోమ్ శాఖ ఈరోజు కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది. రాజధాని తుది నిర్ణయం రాష్ట్ర పరిధిలోకే వస్తుందని కేంద్ర హోంశాఖ హైకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్‌లో పేర్కంది. రాజధాని నిర్ణయంలో కేంద్రానికి ఎలాంటి పాత్ర లేదని తేల్చి చెప్పింది. చట్టసభల్లో సభ్యుల మధ్య జరిగిన చర్చ కోర్టుల్లో న్యాయ సమీక్ష పరిధిలోకి రాదని కేంద్ర హోంశాఖ అఫిడవిట్ లో పేర్కొంది. గతంలో ఏపీకి అమరావతిని రాజధానిగా ఎంపిక చేసుకునే సమయంలో కూడా ఆ నిర్ణయం కేవలం రాష్ట్రానిదేనని అందులో కూడా కేంద్రం జోక్యం చేసుకోలేదని తెలిపింది. రాజధాని అంశం కేంద్ర పరిధిలో ఉంటుందని ఇటీవల కొందరు హై కోర్టులో పిటిషన్లు వేశారు. దీనిపై కేంద్రం తన వైఖరిని తెలియజేయాలని కోర్టు ఆదేశించింది. తాజాగా కేంద్రం తన నిర్ణయాన్ని వెల్లడిస్తూ కోర్టులో కౌంటర్ పిటిషన్ ను దాఖలు చేసింది. ఈ నేపథ్యంలో ఈనెల 14న కోర్టు వాయిదా నేపథ్యంలో ఏం జరుగుతుందోనని అమరావతి జేఏసీ నాయకులు ఆందోళన చెందుతున్నారు .అన్ని దారులు మూసుకోవడం తో కేవలం కోర్టు ద్వారా అమరావతి రాజధాని సాధించాలని తెలుగుదేశం పార్టీ ,జేఏసీ నాయకులు ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో వేచి చూడాల్సిందే


fb twittar linkedin google+ pinterest

WRITE COMMENT

Name:
Phone/Email:
Comment: