జెసి నోటి దురుసు మరో మూడు కేసులు
Published by:Admin, Date:07-08-2020:01:17

తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి నోటి దురుసు కారణంగా విడుదలై 24 గంటలు గడవకముందే మరో మూడు కేసు నమోదు కావడం చర్చనీయాంశంగా మారింది .యాభై నాలుగు రోజులు జైలు జీవితం గడిపిన జేసీ ప్రభాకర్ రెడ్డి ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డి గురువారంకడప జైలు నుండి విడుదలయ్యారు .ఈ సందర్భంగా జరిగిన భారీ ర్యాలీలో తాడిపత్రిలో నిబంధనలు ఉల్లంఘించి ర్యాలీ చేయడంపై సీఐ దేవేందర్ ప్రశ్నించారు దీంతో ఆయనపై జేసీ ప్రభాకర్ రెడ్డి ఫైర్ అయ్యారు .దీనిపై అనంతపురం పోలీసులు విచారణ జరిపి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి పై ఐపీసీ 353,ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు .జేసీ ప్రభాకర్ రెడ్డి నోటి దురుసు కారణంగా మరో మూడు కేసులు నమోదు కావడం తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది .వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలోనే దౌర్జన్యంగా ప్రవర్తించడం చర్చనీయాంశంగా మారింది .


fb twittar linkedin google+ pinterest

WRITE COMMENT

Name:
Phone/Email:
Comment: