రాజమండ్రి సెంట్రల్ జైల్ లో 265మందికి కరోనా ,మాజీ మంత్రి కొల్లు ఇక్కడే ..?
Published by:Admin, Date:07-08-2020:02:59

తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి సెంట్రల్ జైలు 265మంది ఖైదీలకు కరోనా సోకినట్లు తెలిసింది .ఈ నెల మూడో తేదీన 900 మందిఖైదీలకు కరోనా పరీక్షలు చేయగా వారిలో 265 మంది ఖైదీలకు కరోనా పాజిటివ్ వచ్చినట్లు తెలిసింది .జైలు సిబ్బంది 24 మంది కివ్యాధి సోకింది .కోవిడ్ ఆస్పత్రిలో వారిని చేరిస్తే భద్రతా చర్యలు తీసుకోవడం కష్టమవుతుందని జైల్లోనే వారికి చికిత్స అందిస్తున్నారు .హత్య కేసులో అరెస్టైన మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ,ఈఎస్ఐ కుంభకోణం లో అరెస్టైన మాజీ డైరెక్టర్ రమేష్ కుమార్ ,విజయ్ కుమార్ కూడా ఈ జైల్లోనే ఉన్నారు.జైల్లో మొత్తం 1675 మంది ఖైదీ లు ఉండగా వారిలో ఇప్పటికే 265 మంది కి కరోనా సోకడంతో జైలు అధికారులు ,సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు


fb twittar linkedin google+ pinterest

WRITE COMMENT

Name:
Phone/Email:
Comment: