మళ్లీ జెసి అరెస్ట్ తాడిపత్రి లో 144 సెక్షన్
Published by:Admin, Date:07-08-2020:07:59

కాలు జారితే తెలుసుకోవచ్చు నోరు జారితే తీసుకోవడం కష్టమే 'మాజీ ఎమ్మెల్యే జెసి ప్రభాకర్ రెడ్డి విషయంలో అదే జరిగింది .54 రోజుల పాటు బెయిల్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేసినా జేసీ ప్రభాకర్ రెడ్డి గురువారం విడుదలయ్యారు విడుదలైన ఆనందంలో ఆయన పోలీసులపై నోరుజారారు .కరోనా నియమ నిబంధనలు వ్యతిరేకంగా ర్యాలీలు చేయడమే కాకుండా ప్రశ్నించిన తాడిపత్రి సీఐ దేవేందర్ ను దూషించడం తో పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది .ఈ మేరకు శుక్రవారం మళ్లీ అరెస్టయ్యాడు .నోటి దురుసు కారణంగా బెయిల్ వచ్చిన ఆనందం క్షణాల్లో ఆవిరైంది .మొత్తం ఐదు కేసులు నమోదు చేసినట్లు తాడిపత్రి పోలీసులు చెబుతున్నారు .దళిత సి ఐ రేవేంద్రకుమార్ ను దూషించడం ,లాక్‌డౌన్‌ నియమ నిబంధనలు ఉల్లంఘించడం ,506,189,353సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు .డిజాస్టర్ 52 కింద పోలీసులు కేసు నమోదు చేశారు .జేసీ ప్రభాకర్ రెడ్డి అరెస్టు సందర్భంగా తాడిపత్రిలో 144సెక్షన్ విధిస్తూ ,భారీ బలగాలను మోహరించారు .ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు .మరోవైపు పోలీసు అధికారుల సంఘం ఒక ప్రకటన విడుదల చేస్తూ పోలీసులను దూషించిన మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి పై కఠిన చర్యలు తీసుకోవాలని వారు ప్రభుత్వాన్ని కోరారు .మరోవైపు అనంతపురం పోలీస్ స్టేషన్ లో ఉన్న జేసీ ప్రభాకర్ రెడ్డి పరామర్శించడానికి వెళ్లిన ఆయన అల్లుడు ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి నిపోలీసులు అడ్డుకున్నారు .దీంతో ఆయన వాహనం లోనే కొద్దిసేపు ఉండి వెళ్ళిపోయారు .దీంతో తాడిపత్రిలో టెన్షన్ టెన్షన్ వాతావరణ నెలకొంది .


fb twittar linkedin google+ pinterest

WRITE COMMENT

Name:
Phone/Email:
Comment: