మద్యం ప్రియులకు శుభవార్త రాబోతుందా ...?
Published by:Admin, Date:08-08-2020:01:03

మద్యం ప్రియులు మద్యానికి బానిసైఇంట్లో మహిళలను ఇబ్బందులు పడుతున్నారని రాష్ట్ర ప్రభుత్వం మంచి ఉద్దేశంతోప్రభుత్వానికి ఆదాయం తగ్గిన పరవాలేదని భారీగా మద్యం ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకోవడంతోతాజాగా మద్యం ప్రియులు శానిటైజర్ లుతాగి ప్రాణాలు కోల్పోతున్న నేపథ్యంలో మద్యం ధరలు తగ్గించాలనిప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు గా ప్రచారం జరుగుతుంది .రాష్ట్రంలో ఇప్పటికే చాలామంది శానిటైజర్ లు తాగి మృత్యువాత పడ్డారు .శుక్రవారం తిరుపతిలో నలుగురు శానిటైజర్ లు తాగి మృతి చెందడం బాధాకరమని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశాడు .శనివారం తిరుపతిలోని మృతుల కుటుంబాలను పరామర్శించారు.మద్యం ప్రియులు ఎవరు కూడా శానిటైజర్ తాగ రాదని చెప్పారు .ఇప్పటికే తిరుపతి అర్బన్ ఎస్పీ ఆవుల రమేష్ రెడ్డి శానిటైజర్ లుతాగ వద్దని ప్రాణాలు పోతాయని విస్తృతమైన ప్రచారం చేశారు .ప్రకాశం జిల్లాలో దాదాపు 20మంది వరకు మృతి చెందినట్లుగా తెలిసింది .రాష్ట్ర వ్యాప్తంగా మరణాలు పెరగటంతో మద్యం ధరలు తగ్గితే శానిటైజర్ మరణాలు తగ్గుతాయా ?అనే కోణంలో ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది


fb twittar linkedin google+ pinterest





WRITE COMMENT

Name:
Phone/Email:
Comment: