గో బ్యాక్ మోడీ అన్న బాబు నేడు కంబ్యాక్ ఉంటున్నారు
Published by:Admin, Date:08-08-2020:03:02

రాజధాని విషయం బీజేపీ కి సంబంధం లేకపోయినా తమ పార్టీని ముద్దాయి చేయాలని కొన్ని పార్టీలు ప్రయత్నిస్తున్నాయని బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి ఆరోపించారు .గతంలో గో బ్యాక్ మోడీ అన్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు కం బ్యాక్ అంటున్నారని ఎద్దేవా చేశారు . సి.బి.ఐ రాష్ట్రంలోప్రవేశించడానికి వీలు లేదని చెప్పిన చంద్రబాబు నాయుడు రాజధాని విషయంలో మాత్రంకేంద్రం జోక్యం చేసుకోవాలని ఎలా కోరతారని అని ప్రశ్నించారు .అప్పటి రాష్ట్ర ప్రభుత్వం అమరావతి రాజధాని ని ఎంపిక చేస్తే కేంద్రం ఆమోదించినట్లు చెప్పారు .కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా కూడా ఇలాగే చేసి ఉండేదని చెప్పారు .పార్లమెంట్లో తెలుగుదేశం పార్టీ ఎంపీలు గల్లా జయదేవ్ ,కేశినేని నాని అడిగిన ప్రశ్నకు రాజధాని విషయం రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటుందని గతంలోనే కేంద్రం స్పష్టం చేసినట్లు చెప్పారు .చంద్రబాబు నాయుడు ఉదయం మాట్లాడిన మాటలు సాయంత్రం కాంగ్రెస్, సిపిఐ నాయకులు మాట్లాడుతున్నారని చెప్పారు .బీజేపీలోకి చిరంజీవి వస్తే ఆహ్వానిస్తామని ఈ ప్రశ్నకు సమాధానం విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు .


fb twittar linkedin google+ pinterest

WRITE COMMENT

Name:
Phone/Email:
Comment: