రోడ్లపై వినాయక విగ్రహాల కు అనుమతి లేదు
Published by:Admin, Date:08-08-2020:06:24

వినాయక చవితి పండుగను భక్తి శ్రద్ధలతోఇళ్లు, దేవాలయాలకి పరిమితంగా చేసుకుందాం అని ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి అన్నారు.ఆత్మీయులను కోల్పోతూ, వైరస్ బారిన పడిన వారిని కనీసం పరామర్శించేందుకు కూడా వీలు లేని ఈ విపత్కర పరిస్థితులలో పదిమంది ఒక చోట చేరితే ఎంత ప్రమాదం మరెంత నష్టం జరుగుతుందో ఇటీవల సంఘటనలు ద్వారా మనకు తేటతెల్లమవుతోంది, కనుక దేశానికి ఆదర్శంగా నిలిచే విధంగా తిరుపతి ఉత్సవ కమిటీ ప్రతినిధులు పండుగను ఇళ్ళకు, దేవాలయాలకు పరిమితం చేయాలని సూచనలు ఇచ్చిన ఉత్సవ కమిటీ అభినందనలు తెలియజేస్తూ ప్రజలందరూ ఆ దిశగా ఆలోచించి సహకరించాలని అని విజ్ఞప్తి చేశారు. కమిషనర్ గిరీష మాట్లాడుతూ వినాయక సాగర్ వద్ద ఈసారి ఎలాంటి ఏర్పాట్లు ఉండబోవని రోడ్ల మీద అనుమతులు ఇచ్చేది లేదని పండుగ రోజు కు అవసరమైన గణపతి విగ్రహాలు, పూజా సామాగ్రి విక్రయ కేంద్రాలను వీలైనన్ని ఎక్కువ ప్రదేశాలలో పెట్టి ప్రజా ఆరోగ్యం దృష్టిలో పెట్టుకొని , భారమవుతున్న కోవిడ్ సెంటర్లు, ఆసుపత్రుల నిర్వహణ భారం కారణంగా , విగ్రహాల సైజులు కూడా తగ్గించుకోవాలని, ప్రజా ఆరోగ్యం దృష్ట్యా అన్ని సదుపాయాలు చేస్తామని, ఉత్సవ కమిటీ తో కలిసి ముందుకు వెళ్తామని అన్నారు. అర్బన్ ఎస్పీ రమేష్ రెడ్డి మాట్లాడుతూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే పరిస్థితులు చేజారి పోతాయని, కాబట్టి ఇది అందరి యొక్క సమిష్టి బాధ్యత ఇప్పటికే అనేక పండుగలను మనం పరిమితం గా చేసుకున్నాం, వైరస్ వ్యాప్తి ప్రబలి పోతుంది, వినాయక చవితిని కూడా యిండ్ల లోనే భక్తిశ్రద్ధలతో, జరుపుకోవాలని పెద్ద, రోడ్డు మీద ఏర్పాటు చేసే విగ్రహాలకు అనుమతులు ఎలాంటి పరిస్థితుల్లో ఉండవని, 24 గంటలు ప్రజలకు పోలీసు శాఖ అందుబాటులో ఉంటుందని, ఇప్పటికే అనేకమంది పోలీసు సిబ్బంది వైరస్ వలన ఇబ్బంది పడుతున్నారని ఆ దృష్ట్యా ఉత్సవ కమిటీ సూచించినప్పటికీ పరిమిత సంఖ్యలోనే దేవాలయాల వద్ద పండుగ చేసుకోవాలని ఇంటికి దేవాలయానికి భగవంతుని ఈసారికి పరిమితం చేయాలని అన్నారు. ఉత్సవ కమిటీ కన్వీనర్ సామంచి శ్రీనివాస్ మాట్లాడుతూ వైభవంగా అట్టహాసంగా గణపతి దేవుని పండుగ జరుపుకోవాలని ఉన్నా, కమిటీ బాధ్యతాయుతంగా ఆలోచించి, హిందువుల పండుగలన్నీ లోకకళ్యాణం కోసమే జరుపుకుంటామని, ప్రజలన వినాయక స్వామి వారి విగ్రహాలు పండుగ రోజు ఇళ్లలోనే ప్రతిష్టించుకొని అదే రోజు సాయంత్రం ఇళ్ల వద్దనే మంచినీటిలో నిమజ్జనం చేసి ఆ నీటిని చెట్లకు పోయడం వలన పర్యావరణ హితమైన పండుగ జరుపుకునే వారం అవుతామని, వీధుల్లో నిర్వహించే నిర్వాహకులు కూడా మండపాలు పెట్టకుండా కేవలం రెండు అడుగుల మట్టి విగ్రహాన్ని మాత్రమే రోడ్డుకు అడ్డం లేకుండా దగ్గరలో ఉన్న ఏదైనా హిందూ దేవాలయం వద్ద ప్రతిష్టించి పండుగ రోజు సాయంత్రం నిమజ్జనం చేయాలని, భౌతిక దూరం పాటిస్తూ పూజాదికాలు నిర్వహించి ,ఆ గణనాథుడు విఘ్నేశ్వరుని ప్రార్థించాలని కోరారు.విగ్రహ తయారీకి అవసరమైన బంకమట్టిని ఉచితంగా ప్రతి డివిజన్లో అందజేస్తే చిన్న విగ్రహాల తయారీ విధానం పై ఉత్సవ కమిటీ అవగాహన కల్పిస్తుందని తద్వారా మార్కెట్లపై ఒత్తిడి తగ్గించవచ్చని అన్నారు, సూచనల మేరకు ప్రజలందరూ తమ ఆరోగ్యాన్ని ప్రాణాలను కాపాడుకునే దిశగా పవిత్రమైన, భక్తిపుర్వకమైన వాతావరణంలో పండుగ నిర్వహించుకుందాం అని పిలుపునిచ్చారు.


fb twittar linkedin google+ pinterest






WRITE COMMENT

Name:
Phone/Email:
Comment: