ఈ లక్షణాలు ఉంటే వెంటనే ఆసుపత్రిలో చేరండి
Published by:Admin, Date:08-08-2020:07:46

నాలుగు రోజుల నుంచి జ్వరం, శ్వాస తీసుకోవడం లో ఇబ్బంది పడేవారు , ఆక్సిజన్ శాతం 94 కంటే తక్కువగా ఉంటే స్థానికంగా ఉన్న వాలంటీర్ , కార్యదర్శి ని సంప్రదించండని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కెఎస్ జవహర్ రెడ్డి పేర్కొన్నారు. వైరస్ బారిన పడి ఆలస్యంగా చికిత్స కోసం రావడం వల్లే మరణాలు సంభవిస్తున్నాయని, నిర్లక్ష్యం వద్దని , కోవిడ్ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందాలని తెలిపారువిజయవాడలో ని రాష్ట్ర రోడ్డు భవనాలు భవన సముదాయంలో శనివారం విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో రోజుకు వెయ్యి కు పైగా కేసులు నమోదు అవుతున్నా యన్నారు. రాష్ట్రంలో పరిస్థితులు శిఖర స్థాయికి వెళ్ళడం జరుగుతున్న దన్నారు. తూర్పు, పశ్చిమ గోదావరి, అనంతపురం, కర్నూలు, గుంటూరు జిల్లాల్లో ఎక్కువ కేసులు నమోదు అవుతున్నాయన్నారు. నిన్నటి రోజు వరకు 2 లక్షల పై గా పాజిటివ్ కేసులు రాష్ట్రంలో నమోదు అయ్యా యన్నారు. పరీక్షలు జరిపిన సంఖ్య ఆధారం పాజిటివిటీ రేటు 8.76 శాతంగా ఉందన్నారు. ఇప్పటికీ వైరస్ వ్యాప్తి కి 5 నెలలు గడిచి, ఆరో నెలలోకి అడుగు పెట్టిం దన్నారు. మే వరకు ఇది 1 శాతమే ఉందని అన్నారు. జూన్ మాసంలో 2.16 శాతం, జులై నెలకు 12.33 శాతం, ఆగస్టు నెలలో ఇప్పటివరకు ఆస్థాయి 16.24 శాతంగా ఉందన్నారు. మొత్తం పరీక్షలు నిర్వహించిన వాటికి అనుసంధానంగా రాష్ట్రంలో సగటు 8.76 శాతం పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నా యన్నారు. అన్ లాక్ (unlock) ప్రక్రియ అనంతరం ఈ సంఖ్య పెరిగిందన్నారు. ప్రస్తుతం మొత్తంగా 1842 మరణాలు ఉన్నాయని, ఇవి పాజిటివ్ కేసుల్లో 0.9 శాతం అన్నారు. కేంద్ర, ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ఆధారంగా ఒక శాతం లోపు ఉంటే కేసులను బాగా నియంత్రిస్తున్నట్టేనన్నారు. రాష్ట్రంలో బ్పరిస్థితి అడుపులోనే ఉందని, ఐనప్పటికీ ప్రజలు, ప్రభుత్వం తీవ్ర లక్షణాలు ఉన్న వారిపై దృష్టి పెట్టాల్సిఉందన్నారు. 4 రోజులుగా జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది అలాగే ఆక్సిజన్ శాతం 94 శాతం కంటే తక్కువ ఉంటే కోవిడ్ గా భావించి అటువంటి వారికి తక్షణమే ఆస్పత్రుల్లో చికిత్స అందించాలని వైద్య అధికారులకు, జిల్లా కలెక్టర్ లకు స్పష్టం చేశామని జవహర్ రెడ్డి తెలిపారు. ప్రజల్లో స్వచ్ఛందంగా నియంత్రణ చర్యలు చేపట్టాలని, పై పేర్కొన్న లక్షణాలు ఉంటే వాలంటీర్ లకు, ఆరోగ్య కార్యకర్తలు కు తెలిపేలా సెల్ఫ్ రిపోర్టింగ్ పెరగాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు లక్షణాల ఉంటే స్వయంగా చెప్పాలని, అటువంటి లక్షణాలు ఉన్నప్పుడు వెంటనే చికిత్స మొదలు పెడితే మరణాల శాతం తగ్గించ గలుగుతా మన్నారు. ఆఖరి నిముషంలో రావడం వల్ల కొన్నిసార్లు ప్రాణాలు కాపాడలేని పరిస్థితి నెలకొందని కె..ఎస్. జవహర్ రెడ్డి అన్నారు. వైరస్ ప్రబలే దశకు చేరుకుందని, ప్రజలు కూడా బాధ్యతాయుతంగా ఉండాన్నారు. కోవిడ్ వైరస్ సోకకుండా బయటకు వచ్చినప్పుడు మాస్క్ తప్పనిసరిగా ధరించడం, బహిరంగ ప్రదేశాల్లోకి వెళ్ళినప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవడం, తరచుగా చేతులు శుభ్రపరచడం చెయ్యాలన్నారు. వాటి వల్ల 90 శాతం కోవిడ్ వ్యాప్తి తగ్గించ గలుగుతామన్నారు. భౌతిక దూరం, రక్షణ చర్యలు ప్రజలు తప్పనిసరిగా పాటించాలన్నారు. వచ్చే ఆరు నెలలు ఎంతో కీలకం కావున తగిన జాగ్రత్తలు పాటించాలన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం కోవిడ్ మరణాల సంఖ్య ను తగ్గించటమే లక్ష్యం గా పని జేస్తున్నామని ప్రజల్లో పెద్ద ఎత్తున అవగాహన కోసం 104 , 14410 టోల్ ప్రీ, జిల్లా లలో కూడా ఫోన్ నెంబర్ లు పై విస్తృతంగా ప్రచారం జరుగుతోందన్నారు. కోవిడ్ సోకిన రోగులు ఆస్పత్రులలకు వచ్చిన తర్వాత కనీసం 6 రోజులపాటు రోగికి చికిత్స అందిస్తే ప్రాణాపాయం నుండి కాపాడవచ్చని కాని ఆసుపత్రికి వచ్చిన రెండు మూడు రోజుల్లో నే కొందరు చనపోతున్నారని అందులో భాగంగానే కేంద్ర ఆరోగ్య శాఖ ఇచ్చిన క్లినికల్ ప్రోటోకాల్ పాటిస్తున్నామన్నారు. వైరస్ నియంత్రణ కోసం రోగికి రెమెదేశివర్ మందును కూడా అందుబాటులో ఉంచామన్నారు. అత్యవసరం అయితే వెంటిలేటర్ పెడుతున్నామన్నారు.


fb twittar linkedin google+ pinterest






WRITE COMMENT

Name:
Phone/Email:
Comment: