ప్లాస్మా దానం చేయండి అభిమానులకు మహేష్ బాబు పిలుపు
Published by:Admin, Date:08-08-2020:11:02

తన అభిమానులు కూడా ప్లాస్మా దానం చేయాలని ప్రిన్స్ మహేష్ బాబు కోరారు .సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ నిర్వహిస్తున్న ప్లాస్మా అవగాహన కార్యక్రమం నుఆయన అభినందించారు .ఆదివారం తన బర్త్ డే సందర్భంగా అభిమానులకు పిలుపునిచ్చారు .ఈ సందర్భంగా ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ ...కరోనా విలయతాండవం చేస్తున్న వేళ ఒకరికి ఒకరు తోడుగా ఉండడం ఎంతో మంచిదని ఆయన అన్నారు. ప్లాస్మా కరోనా రోగులకు ఎంతగానో ఉపయోగపడుతుందని అభిమానులు స్పందించాలి కోరారు .ప్లాస్మా డొనేషన్ కార్యక్రమంలో పోలీస్ శాఖ చేపడుతున్న కార్యక్రమాలు ప్రశంసనీయమన్నారు ఎందరో ప్రాణాలు కాపాడుతున్న పోలీస్ కమిషనర్ సజ్జనార్ సేవలను ప్రత్యేకంగా అభినందిస్తున్నానని చెప్పారు .45వ బర్తడే సెలబ్రేషన్ చేసుకుంటున్న మహేష్ బాబు సర్కారు వారి పాట చిత్రంలో నటిస్తున్నారు .గీత గోవిందం డైరెక్టర్ పరశురాం దర్శకత్వం వహిస్తున్నారు .


fb twittar linkedin google+ pinterest

WRITE COMMENT

Name:
Phone/Email:
Comment: