అగ్ని ప్రమాద ఘటనపై పలువురి సంతాపం ,50 లక్షల పరిహారం
Published by:Admin, Date:09-08-2020:12:57

విజయవాడ ఒక హోటల్లో అగ్ని ప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌మోహన్ రెడ్డికి ఫోన్‌ చేశారు. ఈ ఘటనపై వివరాలను ముఖ్యమంత్రి ప్రధానికి తెలియజేశారు. ఓ ప్రైవేటు హాస్పిటల్‌ హోటల్‌ను లీజుకు తీసుకుని అందులో కరోనా పేషెంట్లు ఉంచిందని, తెల్లవారు జామున అగ్ని ప్రమాదం సంభవించిందని ముఖ్యమంత్రి వెల్లడించారు. అధికారులు వెంటనే సహాయక చర్యలను చేపట్టారు, దురదృష్టవశాత్తూ కొంతమంది మృత్యువాత పడ్డారని తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యాన్ని అందించాల్సిందిగా ఇదివరకే అధికారులను ఆదేశించామన్నారు. బాధితులను అన్నిరకాలుగా ఆదుకుంటున్నామన్నారు. మృతుల కుటుంబాలను ఆదుకునేందుకు ఒక్కో కుటుంబానికి రూ.50 లక్షల చొప్పున పరిహారం కూడా ప్రకటించామని ప్రధానినరేంద్ర మోడీకి ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి వివరించినట్లుఅధికారులు తెలిపారు .అగ్ని ప్రమాదం సంఘటనపై ప్రధాని నరేంద్ర మోడీతో పాటు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ,ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ,జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ,బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజు తదితరులు సంతాపం ప్రగాఢ సానుభూతి తెలియజేశారు


fb twittar linkedin google+ pinterest

WRITE COMMENT

Name:
Phone/Email:
Comment: