ఫోర్బ్స్‌ జాబితా 2020లో అక్షయ్ కుమార్
Published by:Admin, Date:13-08-2020:01:26

ఫోర్బ్స్‌ జాబితా 2020లో అక్షయ్ కుమార్ చోటు సంపాదించుకున్నారు. ప్రపంచవ్యాప్తం గా అత్యధికం గా రెమ్యునరేషన్ అందుకుంటున్న నటుల జాబితా లో మొదటి 10 మందిని ఫోర్బ్స్ ఎంపిక చేసింది.. వారిని ఫోర్బ్స్‌ జాబితా 2020లో పేర్కొంది.ఈ మేరకు ఫోర్బ్స్‌ జాబితా 2020 మాగజైన్ ను విడుదల చేసింది. ఈ జాబితా లో బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ కూడా ఉన్నారు.. భారత్ నుంచి ఫోర్బ్స్‌ జాబితా 2020లో చోటు సంపాదించినా ఏకైక నటుడు అక్షయ్ కుమార్.ఫోర్బ్స్ విడుదల చేసిన ఈ జాబితా లో అక్షయ్‌ 48.5 మిలియన్‌ డాలర్లు అంటే రూ.363 కోట్ల ఆదాయంతో 6 వ స్థానంలో ఉన్నారు. గతేడాది.. అక్షయ్ ఈ జాబితా లో నాలుగవ స్థానం సంపాదించారు. హాలీవుడ్‌ నటుడు డ్వేన్‌ జాన్సన్‌ 87.5 మిలియన్‌ డాలర్లతో మొదటి స్థానం లో ఉండగా, డెడ్‌పూల్‌ స్టార్‌ ర్యాన్ రెనాల్డ్ 71.5 మిలియన్ల డాలర్లతో రెండో స్థానంలో  ఉన్నారు. మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో  మార్క్‌ వాల్బర్గ్‌, బెన్ అఫ్లెక్‌, విన్‌ డీజిల్ ఉన్నారు. fb twittar linkedin google+ pinterest

WRITE COMMENT

Name:
Phone/Email:
Comment: