నాయకుడంటే ..చెవిరెడ్డి లా ఉండాలి
Published by:Admin, Date:13-08-2020:11:12

 

చిత్తూరు జిల్లా చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కరోనా రోగులతో మమేకమై వారికి ధైర్యం చెబుతూ వైద్యసేవలు అందించడంలో విశేష కృషిచేస్తున్నారు .తిరుపతిలోని ఆసుపత్రిలలోమల్టీడిసీజులతోపాటు కరోనా కలిగిన బాధుతులు, కరోనా సోకిన వయోవృద్ధులకు మరింత ఎక్కువ సంఖ్యలో ఉంటారు. అదే తిరుపతిలోని రాష్ట్ర కోవిడ్ ఆసుపత్రి. ఇక్కడ ఈ ఆసుపత్రి కరోనా బాధితులతో కిటకిలాడుతుంటుంది. వీరిలో చాలా మంది ఆక్సిజన్ మాస్కులు, వెంటిలేటర్ల ద్వారా వైద్యం పొందుతుంటారు. అంటే కరోనా తీవ్రత అధికంగా ఉన్న ప్రాంతం. ఆ మధ్య కాలంలో 68 మంది ఇక్కడ పని చేస్తున్న సిబ్బందికి కరోనా సోకింది కూడా. ఇక్కడ పని చేయాలంటేనే వైద్యం సిబ్బంది జంకుతుంటారు. అక్కడ భయంతోనూ, ఇతరవ్యాధులతోనూ మరణించే కరోనా పేషంట్లు కనిపిస్తున్నారు. ఇది భాస్కర్ రెడ్డిని కలిచి వేసింది. అక్కడున్న వారికి మానసిక ధైర్యం కల్పించాల్సిన అవసరం ఉందని ప్రభుత్వ విప్ భాస్కర్ రెడ్డి భావించారు. కరోనా విలయతాండవం చేస్తున్న వేళ ఐసియూ కోవిడ్ పేషంట్ల బాగోగులు తెలుసుకునేందుకు ప్రభుత్వ విప్, తుడ ఛైర్మన్ డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ధైర్యం చేశారు. తాజాగా కరోనాతో మరణించిన ఒకరిద్దరు పేషంట్ల మృతదేహాలను అక్కడ నుంచి మార్చురీకి తరలిస్తున్నారు. అయినా భాస్కర్ రెడ్డి లెక్కచేయలేదు. ఏకంగా రాష్ట్ర స్థాయిలో అతిపెద్ద కోవిడ్ ఆసుపత్రి అయిన స్విమ్స్ శ్రీ పద్మావతిలోని ఐసీయు కేంద్రంలోకి ప్రవేశించారు. అయ్యప్ప మాలధారణంలో ఉన్న ఆయన కాళ్ళకు చెప్పులు వేసుకోవాడానికి వీలులేదు. కాళ్ళ ద్వారా వైరస్ సోకే అవకాశం ఉందని తెలిసినా కేవలం పీపీఈ కిట్లకు వచ్చే తొడుగులతోనే ఆసుపత్రిలోకి వెళ్ళారు. గురువారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు అక్కడ వైద్య సేవలు పొందుతున్న కరోనా బాధితులను ఒక్కొక్కరిగా పలకరించారు. వారితో మమేకమయ్యారు. కరోనా వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్న ఈ ఆసుపత్రిలో ప్రతి ఫ్లోరు, ప్రతి గది, ప్రతి బెడ్డును సందర్శించారు. మీకు నేనున్నానంటూ భుజం తట్టి భరోసా కల్పించారు. ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 390 మంది కోవిడ్ పేషంట్ల ను పలకరించి వారి బాగోగులు అడిగి తెలుసుకున్నారు. కోవిడ్ బాధితులతో ఆప్యాయంగా మాట్లాడుతూ ధైర్యాన్నిచ్చారు. ‘నీకు ఏమీ కాదు.. త్వరగా కోలుకుంటావంటూ భుజం తట్టారు. ఆరోగ్యంగా తిరిగి ఇంటికి వస్తారంటూ బాధితుల్లో మనో ధైర్యాన్ని నింపారు. చికిత్స పొందుతున్న బాధితులు చెవిరెడ్డిని చూసి తమ అప్యాయంగా పలుకరించడానికి నాయకుడు వచ్చాడని, తమకు ఏమీ కాదన్న ఆనందం వ్యక్తం చేశారు. అన్నింటికి మించి కరోనా ఎదుర్కోవడానికి మానసిక స్థైర్యం అవసరమని, ఆందోళన పడవద్దు. భయం దరిదాపులకు కూడా రానియ్యకుండా మనోనిబ్బరంతో ఉండాలని అప్పుడు మాత్రమే కరోనా జయించడం సాధ్యమవుతుందని చెవిరెడ్డి వారి ధైర్యం చెప్పారు. సాధారణంగా బంధుమిత్రులకు దూరంగా ప్రత్యక్షంగా పలుకరించే వారు కరువైన వారికి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తమను పలకరించడం వారు మానసిక ఉల్లాసాన్ని పొందారు.  కేవలం రోగులను పరామర్శించడమే కాకుండా డాక్టర్లకు ధైర్యం చెప్పారు. పారిశుద్ధ్య కార్మికులను, డాక్టర్లు, నర్సులతో ఆప్యాయంగా మాట్లాడారు. వారి సేవల పట్ల అభినందనలు తెలియజేశారు. కోవిడ్ పేషంట్లకు నాణ్యమైన ఆహారం అందించాలని, మెరుగైన సేవలు కల్పించాలని డాక్టర్లు, అధికారులకు సూచించారు. వారి అవసరాలను అడిగి తెలుసుకున్నారు. తన వెంట తీసుకెళ్ళిన డాక్టర్ల బృందంతో సమస్యలకు పరిష్కారం చూపారు. కరోనా బారిన పడి అక్కడే చికిత్స పొందుతున్న జర్నలిస్టులు, డాక్టర్లు, వైద్య సిబ్బందిని పలుకరించి ధైర్యం చెప్పారు. ప్రతి ఒక్కరికీ అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తామని ఆయన వారికి వివరించారు. సమస్యలుంటే తాము ఏర్పాటు చేసిన కాల్ సెంటర్‌కు  ఫోన్ చేసి చెబితే తక్షణం సాయం చేస్తామని హామీ ఇచ్చారు.  ప్రజా ప్రతినిధి అంటే ఆదేశాలు జారీ చేసే వాడు కాదని.. సాధకబాధకాలు అడిగి తెలుసుకుని ధైర్యాన్ని ఇచ్చేవాడే నిజమైన నాయకుడు అని అక్కడి వైద్యులు, నర్సులు, పారిశుద్ధ్య కార్మికులు చెప్పుకోవడం గమనార్హం. ఈ సందర్భంగా చెవిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు కోవి డ్ బాధితులకు సేవ చేస్తున్నప్పటికీ నేరుగా వారితో మాట్లాడాలి.. వారి బాగోగులు, వారికి  అందుతున్న సౌకర్యాలు తెలుసుకోవాలి అని శ్రీ పద్మావతి స్టేట్ కోవి యాడ్ ఆసుపత్రిని సందర్శించినట్లు తెలిపారు. పారిశుద్ధ్య కార్మికులు, డాక్టర్లు, నర్సులు చేస్తున్న సేవలు అనన్యమైనవని కొనియాడారు. కొన్ని నెలలుగా నియోజకవర్గ ప్రజలకు అండగా నిలబడటమే కాకుండా కోవిడ్ సమన్వయ కమిటీ ద్వారా 16 సబ్ కమిటీలు, 7 కోవిడ్ ఆసుపత్రులు, క్వారంటైన్ కేంద్రాల ఏర్పాటు ద్వారా బాధితులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తూ జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో బాధ్యతాయుతంగా సామాజిక సేవకు శ్రీకారం చుట్టామని వెల్లడించారు.  కరోనాతో పోరాటం సాగించాలి గానీ, బాధితులతో కాదని ప్రజలకు పిలుపునిచ్చారు. చెవిరెడ్డి వెంట జేసీ వీరబ్రహ్మం (అభివృద్ది) కూడా కోవి‌డ్ బాధితులను పరామర్శించారు.fb twittar linkedin google+ pinterest

WRITE COMMENT

Name:
Phone/Email:
Comment: