జగన్ సన్నిహిత మాజీ ఎమ్మెల్యే మృతి Published by:Admin, Date:18-08-2020:09:11 |
|
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తెలంగాణ రాష్ట్రంలో కీలక వ్యవహరించిఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి తో సన్నిహిత సంబంధాలు నడిపి 2018లొటిఆర్ఎస్ లో చేరిన నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే ఎడ్మ కృష్ణారెడ్డి అనారోగ్యంతో మృతి చెందారు. గత కొంతకాలంగా హైదరాబాద్‌లో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం తుది శ్వాస విడిచారు.ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ తీవ్ర ప్రగాఢ సానుభూతి సంతాపం వ్యక్తం చేశారు .ఎడ్మ కృష్ణారెడ్డి కల్వకుర్తి పట్టణ సర్పంచ్‌గా రాజకీయ ప్రస్థానం మొదలు పెట్టారు. కల్వకుర్తి మండల పరిషత్ అధ్యక్షునిగా పనిచేశారు. రెండు సార్లు ఎమ్మెల్యేగా పని చేశారు. 1994లో స్వతంత్ర అభ్యర్థిగా, 2004లో కాంగ్రెస్ పార్టీ తరుపున ఎమ్మెల్యేగా ఎడ్మ కిష్టారెడ్డి గెలుపొందారు. సోషలిస్టు భావాలు కలిగిన కృష్ణారెడ్డి నమ్మిన సిద్దాంతాలకు కట్టుబడి పనిచేశారు. టీడీపీ చీలిక సమయంలో అన్న టీడీపీ పార్టీతో కలిసి పనిచేశారు. 1994లో టీడీపీ నుంచి సీటు రాకపోవటంతో స్వతంత్ర అభ్యర్దిగా పోటీ చేసి విజయం సాధించారు. 2004లో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందారు. 2009 ఓటమి చెందారు. 2014లో వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2018 సాధారణ ఎన్నికల ముందు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. వైఎస్ఆర్సీపీ ఉమ్మడి పాలమూరు జిల్లా అధ్యక్షుడిగా, వైఎస్ఆర్సీపీ రైతుసమితి రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. రాంమనోహర్ లోహియ సిద్దాంతాలకు ఆకర్శితులై పనిచేశారు. మాజీ గవర్నర్ రామారావు శిషష్యుడిగా గుర్తింపు ఉంది. రైతు సమస్యలపై ఎన్నో పోరాటాలు చేశారు. ముఖ్యంగా కల్వకుర్తి నియోజకవర్గంలో విద్యుత్ సమస్యలపై పోరాటం చేశారు. కిష్టారెడ్డి మృతి నియోజకవర్గానికి తీరనిలోటని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. కిష్టారెడ్డికి భార్య, ఇద్దరు కొడుకులు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.
|
![]() ![]() |
WRITE COMMENT
తాజా వార్తలు తాజా వార్తలు
|
స్వీమ్స్ లోని కోవిడ్ -19 ల్యాబ్ కు రూ.25 లక్షలు విరాళం |
|
సెప్టెంబరు 29 నుండి తిరుమలలో '' షోడశదిన సుందరకాండ దీక్ష '' |
|
బాలు మృతి పై టీటీడీ ఛైర్మన్ సంతాపం |
|
తిరుమలలో కర్ణాటక సత్రాల వసతి సముదాయాల నిర్మాణానికి భూమిపూజ |
|
ఈనెల 23, 24 ముఖ్యమంత్రితిరుపతిపర్యటన |
సినిమా వార్తలు
|
బాలీవుడ్ డ్రగ్స్ కేసు విచారణను వేగవంతం |
|
అల్లు అర్జున్‌పై పోలీస్ కంప్లైంట్ |
|
.విభిన్న పాత్రలతో మెప్పించిన జయప్రకాష్ రెడ్డి |
|
సుశాంత్ కేసులో కీలక మలుపు.. రియా అరెస్ట్ |
|
ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం హెల్త్ బులిటెన్ |