స్పీడ్ పెంచిన ప్రభాస్
Published by:Admin, Date:18-08-2020:10:11

యంగ్‌ రెబల్‌ స్టార్ప్రభాస్ స్పీడ్ పెంచాడు .రాదే శ్యాం సినిమా పూర్తిగా  ,నాగ అశ్విన్ దర్శకత్వం అశ్విని దత్ సినిమాకుసంతకం చేయగా తాజాగా ఆదిపురుష్‌’ సినిమాతో బాలీవుడ్‌కు డైరెక్ట్‌ ఎంట్రీ ఇవ్వనున్న సంగతి తెలిసిందే. అజయ్‌ దేవ్‌గణ్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కిన పిరియాడికల్‌ సినిమా 'తాన్హాజీ' ద‌ర్శ‌కుడు ఔంరౌత్‌ ఈ భారీ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ఇందుకు సంబంధించి మంగళవారం సోషల్‌ మీడియా వేదికగా అధికారిక ప్రకటన రావడంతో ప్రభాస్ అభిమానులు సంతోషంలో మునిగిపోయారు. ఇక మూవీ టైటిల్‌ పోస్టర్‌లో హ‌నుమంతునితో పాటు రామాయణంలో కనిపించే పలువురు మునుల పాత్రలను ప్రతిబింబించేలా చిత్రాలు ఉండటం సహా.. "చెడుపై మంచి సాధించే విజ‌యాన్ని పండ‌గ ‌చేసుకుందాం" అనే క్యాప్ష‌న్‌ ఫిక్స్‌ చేయడంతో ఇది పౌరాణిక చిత్రమేనని, పోస్టర్‌లో ఉన్న ఫోజుని బట్టి ప్రభాస్‌ ఈ సినిమాలో రాముడి క్యారెక్టర్‌ చేయనున్నాడని చాలా మంది ఫిక్సయిపోయారుfb twittar linkedin google+ pinterest

WRITE COMMENT

Name:
Phone/Email:
Comment: