నిన్న ఎస్ పి నేడు సునీత ,మాళవిక
Published by:Admin, Date:18-08-2020:10:26

బుల్లితెర లో ప్రచారం అవుతున్న సంగీత కార్యక్రమంలో పాల్గొన్న ఎస్పీ బాలసుబ్రమణ్యం కరోనా బారిన పడగా తాజాగా సింగర్ సునీత,మాళవిక కరోనా బారిన  బయటపడినట్లు  తెలిసింది .దీనినే సింగర్ సునీత ధృవీకరిస్తూ వీడియో వైరల్ చేశారు .అందరికీ నమస్కారం. నా ఆరోగ్యం గురించి బంధువులు, స్నేహితులు, మీడియా నుంచి వరుస ఫోన్‌ కాల్స్‌ వస్తున్నాయి. దీనిపై స్పష్టత ఇచ్చేందుకే మీ ముందుకు వచ్చా. కొన్ని రోజుల కిందట నేను కరోనా బారిన పడ్డా. ఒక షూటింగ్‌కు వెళ్తే తలనొప్పిగా అనిపించింది. అశ్రద్ధ చేయకుండా నా తల్లిదండ్రులను దృష్టిలో పెట్టుకుని పరీక్ష చేయించుకున్నా. దురదృష్టవశాత్తూ పాజిటివ్‌ అని వచ్చింది. చాలా స్వల్ప లక్షణాలు ఉన్నాయి. సాధారణ జీవితంలో అలాంటివి మనం లెక్క చేయం. ఇప్పుడు నేను పూర్తిగా కరోనా నుంచి బయటపడ్డా. ఆరోగ్యంగా ఉన్నా. ఎప్పటికప్పుడు వైద్యుల సలహాలు తీసుకుంటూ, జాగ్రత్తలు పాటిస్తూ, వ్యాధి నుంచి బయటపడ్డా. ఇదే విషయాన్ని మీకు చెప్పాలనుకున్నా. అయితే, ఇప్పుడు నేను బాలుగారి ఆరోగ్యం విషయంలో చాలా ఆందోళనగా ఉన్నా. నేను, నా కుటుంబం ఆయన కోలుకోవాలని ప్రార్థిస్తున్నాం. మనందరం ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుందాం. మీరందరూ కూడా సురక్షితంగా ఉండండి. దేన్నీ తేలికగా తీసుకోవద్దు. నాపై చూపిన, ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు’’ అని సునీత పేర్కొన్నారు.fb twittar linkedin google+ pinterest

WRITE COMMENT

Name:
Phone/Email:
Comment: