జేసీకి కరోనా పాజిటివ్
Published by:Admin, Date:18-08-2020:11:07

కడప జైలు లో ఉన్న టిడిపి తాడిపత్రిమాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి కి కరోనా  పాజిటివ్ నిర్ధారణ అయింది .కడప జైల్లో ఉన్న ఖైదీలకు కరోనా పరీక్షలు చేయగా 317 మందికి కరోనా సోకినట్లు తెలిసింది .వారిలో జేసీ ప్రభాకర్ రెడ్డి కూడా ఉన్నారు .వాహనాల అక్రమ రిజిస్ట్రేషన్  కేసులో అరెస్ట్ అయిన జేసీ ప్రభాకర్ రెడ్డి ఇటీవల బెయిల్ పై ఇటీవల విడుదలై వాహనర్యాలీలో పోలీసులతో వాగ్వాదానికి దిగడం ,ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు అయ్యింది ఐదు కేసులు నమోదయ్యాయి దీనికి సంబంధించి మళ్లీ అరెస్టు చేయడం .ఇటీవలనే రెండు రోజుల కస్టడీ ముగియడంతో మళ్లీ కడప జైలుకు తరలించారు .ఈ నేపథ్యంలో తాజాపరీక్షల్లో జేసీ ప్రభాకర్ రెడ్డి కి కరోనా పాజిటివ్ వచ్చింది .దీంతో జైలు అధికారులు ఆయనను ప్రత్యేక గదిలో పెట్టి చికిత్స చేస్తున్నారుfb twittar linkedin google+ pinterest

WRITE COMMENT

Name:
Phone/Email:
Comment: