నన్ను వేధించారు అంటున్న అనుష్క
Published by:Admin, Date:24-08-2020:10:42

 

 

సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ పై వివాదం నివురుగప్పిన నిప్పులా కొనసాగుతూనే ఉంది. అడపాదడపా ఎవరో ఒకరు మీడియా ముందుకు వచ్చి క్యాస్టింగ్ కౌచ్‌ పై వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా తాను కూడా అలాంటి వేధింపులు ఎదురుకున్నా అని చెప్పి షాక్ ఇచ్చింది స్టార్ హీరోయిన్ అనుష్క .  అనుష్క నటించిన నిశ్శబ్దం సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. తాజాగా అనుష్క ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ .. తాను కూడా సినీ పరిశ్రమలో క్యాస్టింగ్‌ కౌచ్ వల్ల వేధింపుల బారిన ప‌డ్డాన‌ని పేర్కొంది. సినీ రంగంలో ఇటువంటి వేధింపులు ఎదురవుతాయన్న విష‌యం అందరికీ తెలిసిందే అని చెప్పుకొచ్చింది. టాలీవుడ్ లో కూడా క్యాస్టింగ్ కౌచ్‌ ఉందని కెరియర్ స్టార్టింగ్ లో తానుకూడా అవి ఎదురుకున్నానని తెలిపింది.  స్ట్రైట్ ఫార్వార్డ్ గా ఉండటం . దైర్యంగా వ్యవహరించడం వల్లే క్యాస్టింగ్‌ కౌచ్‌ నుంచి త‌ప్పించుకోగ‌లిగానని ఆమె తెలిపింది. ఆతర్వాత ఇంతవరకు తనతో ఎవ్వరూ అలా ప్రవర్తించలేదని అనుష్క తెలిపింది.fb twittar linkedin google+ pinterest

WRITE COMMENT

Name:
Phone/Email:
Comment: