నేను రఘురామ కృష్ణంరాజు లాంటి వాడిని కాదు :ఎమ్మెల్యే
Published by:Admin, Date:25-08-2020:07:18

నేను నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు లాగా పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడే వాడిని కాదు తన పై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని జమ్మలమడుగు ఎమ్మెల్యే డాక్టర్ సుధీర్ రెడ్డి మంగళవారం ఖండించారు .ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి లేకపోతే తాను రాజకీయాల్లోకి వచ్చి ఉండేవాణ్ణి కాదని ఆయన ఎప్పుడు  రాజీనామా చేయమంటే అప్పుడు రాజీనామా చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు .వైఎస్సార్ కుటుంబాన్ని ఎదిరించిన వాళ్ళు బాగుపడింది లేదన్నారు .నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు ఎందుకు ఇలా చేస్తున్నారు అర్థం కావడం లేదన్నారు .నేను వై యస్ కుటుంబానికి విధేయుడని  ,వచ్చే ఎన్నికల్లో తనకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తే పోటీ చేస్తాను .లేదంటే లేదు అంతేగాని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ,జగన్మోహన్ రెడ్డి కివ్యతిరేకంగా నడుచుకునే ప్రసక్తే లేదు .తన గెలుపులో (2019ఎన్నికల్లో 51941భారీ మెజార్టీ )కడప ఎంపీ అవినాష్ రెడ్డి కీలక పాత్ర పోషించారని అటువంటి కుటుంబానికి వ్యతిరేకంగా తాను పనిచేయని అన్నారు .జమ్మలమడుగు మాజీ మంత్రి  రామ సుబ్బారెడ్డి ఇటీవల తెలుగు దేశం పార్టీకి రాజీనామా చేసి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం విదితమే !ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కి ,రామసుబ్బారెడ్డి మధ్య రాజకీయ విభేదాల నేపథ్యంలో పలు వార్తలు రావడంతో సుధీర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు fb twittar linkedin google+ pinterest

WRITE COMMENT

Name:
Phone/Email:
Comment:


Name:   
Comment:   I am sure this article has touched all the internet visitors, its really really good article on building up new blog. I could not refrain from commenting. Perfectly written! I couldn’t refrain from commenting. Well written! http://cspan.co.uk
29-08-2020::08:45