బిగ్ బాస్ హౌస్ లో కరోనా కలకలం
Published by:Admin, Date:25-08-2020:10:08

ఆగస్టు చివరి నాటికి మాటీవీలో బిగ్ బాస్ 4ప్రారంభం కానుంది  .ఇప్పటికే ప్రోమో ను కూడా విడుదల చేసేసారు. ఈ షో కి నాగార్జున హోస్ట్ గా వ్యవహరించబోతున్న సంగతి కూడా విదితమే.. అసలే.. కరోనా విస్తరిస్తున్న నేపధ్యం లో ఈ షో విషయం లో నిర్వాహకులు పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.ఈ నేపథ్యంలో కార్యక్రమం నిలిపివేయాలని హెచ్ ఆర్ సి లో తెలంగాణ మహిళా సంఘం నేతలు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది .

              ఈ షో లో పాల్గొనబోయే కంటెస్టెంట్స్ అందరిని ఇప్పటికే కరోనా టెస్ట్ లు చేశారు.. నెగటివ్ వచ్చిన వారిని క్వారంటైన్ లో ఉంచారు.. వీరు బయటకు వెళ్లేందుకు  వీలు లేదు.. షూటింగ్ ప్రారంభం అయ్యే ముందు మరో సారి కరోనా టెస్ట్ చేస్తారు. అప్పుడు కూడా కరోనా నెగటివ్ వస్తేనే వీరిని హౌస్ కు తీసుకెళ్లారు. అయితే.. తాజాగా రెండవసారి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. ఒకరికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిందట..

               ఇప్పటికే ఈ సారి షో లో పాల్గొంటున్న వారి పేర్లు బయటకు వచ్చేసిన సంగతి తెలిసిందే..  జబర్దస్త్‌ కెవ్వు కార్తీక్‌, సింగర్ నోయల్‌ సేన్‌, యాంకర్లు లాస్య, అరియానా, నటులు కరాటే కళ్యాణి, సురేఖా వాణి, పూనమ్ బజ్వా, పూజిత పొన్నాడ, నందు యూట్యూబర్లు అలేఖ్య హారిక, మహబూబ్ దిల్‌ సే, గంగవ్వ, కొరియోగ్రాఫర్ రఘు మాస్టర్‌  ఉన్నారని తెలుస్తోంది. కాగా.. నందు ఇప్పటికే తాను బిగ్ బాస్ లో  ఉన్నట్లు ప్రకటించారు. కాగా.. వీరిలో ఓ సింగర్ కు కరోనా వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది .ఈ పరిస్థితుల్లో హెచ్ ఆర్ సి నిర్ణయం ఆసక్తికరంగా మారనుంది fb twittar linkedin google+ pinterest

WRITE COMMENT

Name:
Phone/Email:
Comment: