ఏపీ సి ఓ ఎస్ లో విలీనం చేస్తూ బోర్డు తీసుకున్నతీర్మానాన్నిరద్దు చేయాలి
Published by:Admin, Date:27-08-2020:08:35

టిటిడి ఔట్‌సోర్సింగ్ సిబ్బందిని APCOSలో విలీనం చేస్తూ బోర్డు చేసిన తీర్మానాన్ని ర‌ద్దు చేయాల‌ని, టైంస్కేల్ వ‌ర్తింప‌చేయాల‌ని కోరుతూ  ఔట్‌సోర్సింగ్ సిబ్బంది గురువారం  తిరుప‌తిలోని శ్రీ ప‌ద్మావ‌తి విశ్రాంతి గృహంలో టిటిడి ఛైర్మ‌న్ వైవి.సుబ్బారెడ్డికి విన‌తి‌పత్రం స‌మ‌ర్పించారు. 

 ఈ సందర్భంగా టీటీడీ ఉద్యోగ సంఘాల నాయకులతో చైర్మన్ సమావేశమై సమస్యలపై చర్చించారు. అనంతరం చైర్మన్ మాట్లాడుతూ టీటీడీ లోని ఔట్సోర్సింగ్, కాంట్రాక్ట్ కార్మికులకు దశలవారీగా న్యాయం చేయాలని ముఖ్యమంత్రి వైయస్.జగన్మోహన్ రెడ్డి తనకు సూచించారని, ఆ మేరకు తమ బోర్డు ప్రయత్నాలు చేస్తోందని తెలిపారు. కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలన్న ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన APCOSలో విలీనం చేయాలని బోర్డు నిర్ణయించిందన్నారు. అయితే అవుట్సోర్సింగ్ ఉద్యోగులు దీనిపై వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారని, ఉద్యోగులకు నష్టం కలిగించే చర్యలు ఎట్టి పరిస్థితుల్లోనూ చేపట్టేది లేదని స్పష్టం చేశారు. అక్టోబర్ లో జరిగే ధర్మకర్తల మండలి సమావేశంలో ఈ విషయం పై చర్చించి రాష్ట్ర ప్రభుత్వానికి మరోసారి లేఖ రాస్తామని తెలియజేశారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు టిటిడి పరిపాలనా భవనం ఎదుట నిరసన దీక్షలు చేపట్టడం తగదని, ఏమైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని సామరస్యంగా పరిష్కరిస్తానని వెల్లడించారు. వెంటనే నిరసన దీక్షలు నిలిపివేయాలని కోరారు.

  ఈ కార్యక్రమంలో టిటిడి ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల సంక్షేమ సంఘం గౌర‌వాధ్య‌క్షులు ఎం.నాగార్జున, ఎంప్లాయిస్ బ్యాంక్ డైరెక్ట‌ర్ జి.వెంక‌టేశం, టిటిడి జెసిఎ ఛైర్మ‌న్ జి.వెంక‌ట‌ర‌మ‌ణారెడ్డి, టిటిడి ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల సంక్షేమ సంఘం ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి హ‌రికృష్ణ‌, కోశాధికారి నవీన్ కుమార్‌, ఉపాధ్యక్షుడు జి.హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.fb twittar linkedin google+ pinterest

WRITE COMMENT

Name:
Phone/Email:
Comment: