టీడీపీకి షాక్ ఇచ్చిన ఓంప్రతాప్ కుటుంబ సభ్యులు
Published by:Admin, Date:27-08-2020:09:14

చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలోని సోమల మండలంలోని కామిరెడ్డిగారిపల్లి పంచాయతీ బండకాడపల్లి హరిన వాడకు చెందిన ఓం ప్రతాప్ అనారోగ్యం కారణంగా చనిపోవడంతో దానిని పని కట్టుకొని చంద్రబాబు గారు మరియు అతని తనయుడు నారా లోకేష్ గారు అనవసరంగా మా కుటుంబాన్ని రాజకీయాల్లోకి లాగి శవరాజకీయాలు చేస్తున్నారని మృతుని చిన్నాన్న రమణ,మృతుని తమ్ముడు ఓం ప్రకాష్ తెలిపారు.ఆనారోగ్య కారణంతోనే చనిపోయారని చనిపోయిన వ్యక్తి వృత్తి రిత్యా డ్రైవర్  మదనపల్లిలో నివసిస్తున్నారని అని అన్నారు.మా కుటుంబానికి కాని మా వాడికి కాని మంత్రి పెద్దిరెడ్డి కుటుంబం మరియు అనచరుల నుంచి ఎటువంటి ఓత్తిడిలు గురి అవ్వలేదని అనవసరంగా టిడిపి నేతలు మంత్రి పెద్దిరెడ్డిని రాజకీయంగా జిల్లాలోనే కాకుండా రాష్ర్టంలో ఎదురుకోలేక శవరాజకీయాలు నడుపూతూ మమ్మల్ని వాడుకుంటున్నారని దయచేసి చెబుతున్నాను టిడిపి నాయకులకు మా దళితుల్ని అడ్డం పెట్టుకొని మా కుటుంబానికి రాజకీయ రంగు పుస్తూ వాడుకుంటూన్నారని అన్నారు.దయ చేసి మమ్మల్ని మీ రాజకీయాల్లో లాగోద్దని ఇప్పటికే అర్థం సచ్చిపోయామని మా అన్న అనారోగ్యం కారణంగానే చని పోయారని పని పట్టుకోని వారు రాజకీయంగా లబ్ది పొందడానికి జిల్లాలో పట్టు సాధించడానికి మంత్రి పెద్దిరెడ్డి అనచరుల బెదింపులతోనే చనిపోయాడని రాద్దాంతం చేస్తున్నారని మృతుని తమ్ముడు వా పోయాడు.సార్ చంద్రబాబు గారు అనవరంగా మమ్మల్ని రాజకీయాల్లోకి లాగోద్దంటూ కంటనీరు పెట్టుకోన్నారు. అనవరంగా మమ్మల్ని రాజకీయాల్లోకి లాగితే మీ పై కేసులు పెడతామని అన్నారు.దయచేసి చెబుతున్నాము మీడియా వారు అనవరంగా మా దగ్గరకు వచ్చి ఏవేవో ప్రశ్నలు వేస్తున్నారని మిడియా వారికి కూడా చెబున్నాము దయ చేసి మా కుటుంబాన్ని రాజకియ రంగు పూస్తూ రోడ్ల పాలు చెయద్దండీ.అందరికి మళ్లీ మళ్ళీ చెబుతున్నాం మా  వాడు అనారోగ్య కారణంగానే చనిపోయాడు.దయ చేసి మమ్మల్ని ఇంకా క్షోబించకండి అని తెలిపారు.fb twittar linkedin google+ pinterest

WRITE COMMENT

Name:
Phone/Email:
Comment: