వేటూరి ప్రభాకరశాస్త్రి విగ్రహానికి ఘనంగా పుష్పాంజలి
Published by:Admin, Date:29-08-2020:09:43

ప్రముఖ సాహితీవేత్త శ్రీవేటూరి ప్రభాకరశాస్త్రి 70వ వర్ధంతిని పురస్కరించుకుని తిరుపతిలోని టిటిడి శ్వేత భవనం ఎదురుగా గల ఆయన కాంస్య విగ్రహానికి శ‌నివారం ఉద‌యం టిటిడి అధికారులు పుష్పాంజలి ఘటించారు. ఎస్వీ వేద విశ్వ‌విద్యాల‌యం, ఎస్వీ ఒరియంటల్ క‌ళాశాల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.

 

          ఈ సందర్భంగా టిటిడి డిఈవో శ్రీ ర‌మ‌ణ ప్ర‌సాద్ మాట్లాడుతూ శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి తెలుగు సాహిత్యానికి, టిటిడికి చేసిన సేవలకు గుర్తింపుగా ఆయన జయంతి, వర్ధంతి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ప్రభాకరశాస్త్రిని కవిగా, చరిత్ర పరిశోధకుడిగా, శాసన పరిశోధకుడిగా, ప్రాచీనాంధ్ర సంకలన ప్రచురణకర్తగా, సంస్కృత రూపకానువాదకర్తగా, తాళపత్ర గ్రంథ వివరణ రచయితగా, అన్నమయ్య సంకీర్తన సాహిత్యోద్ధారకుడిగా, అన్నమాచార్య ఉత్సవాల ప్రథమ ప్రారంభకుడిగా ఆయన అభివర్ణించారు.

 

          ఈ కార్య‌క్ర‌మంలో ఎస్వీ వేద విశ్వ‌విద్యాల‌యం రిజిష్ట‌ర్ శ్రీ రామ‌చంద్ర‌, ఎస్వీ ఒరియంటల్ క‌ళాశాల ప్రిన్సిపాల్ శ్రీ సురేంద్ర పాల్గొన్నారు.fb twittar linkedin google+ pinterest

WRITE COMMENT

Name:
Phone/Email:
Comment: