శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ పవిత్రోత్సవాలకు అంకురార్పణ
Published by:Admin, Date:29-08-2020:09:46

తిరుచానూరులోని శ్రీ పద్మావతీ అమ్మవారి ఆలయ పవిత్రోత్సవాలకు ఆగ‌స్టు 30వ తేదీ ఆదివారం సాయంత్రం అంకురార్పణ జరుగనుంది. ఆగ‌స్టు 31 నుండి సెప్టెంబరు 2వ తేదీ వరకు పవిత్రోత్సవాలు జరుగనున్నాయి. ఆదివారం సాయంత్రం విష్వక్సేనారాధన, పుణ్యహవచనం, రక్షాబంధనం, మృత్సంగ్రహణం, సేనాధిపతి ఉత్సవం, అంకురార్పణ, పవిత్ర అధివశం నిర్వహిస్తారు.

 

ఆలయంలో సంవత్సరం పొడవునా పలు క్రతువుల్లో తెలిసీ తెలియక జరిగిన దోషాల నివారణకు పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు. ప్రతి ఏడాదీ మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. 

ఆగ‌స్టు 31వ తేదీన పవిత్రప్రతిష్ఠ, సెప్టెంబ‌రున 1న పవిత్ర సమర్పణ, సెప్టెంబరు 2న పూర్ణాహుతి కార్యక్రమాలు జరుగనున్నాయి. 

   కోవిడ్ - 19 నిబంధన‌ల మేర‌కు అమ్మ‌వారి ఆల‌యంలో ప‌విత్రోత్స‌వాలు ఏకాంతంగా నిర్వ‌హించ‌నున్నారు.‌fb twittar linkedin google+ pinterest

WRITE COMMENT

Name:
Phone/Email:
Comment: