డామిట్ కథ అడ్డం తిరిగింది !టిడిపి రాష్ట్ర అధ్యక్షుడిగా కింజారపు ?
Published by:Admin, Date:30-08-2020:10:53

తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కళా వెంకట్రావు ఐదేళ్ల కాలపరిమితి ముగిసింది .దీంతో నూతన అధ్యక్షుని నియమించడానికి తెలుగుదేశం పార్టీజాతీయ  అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లు దృష్టి సారించకపోవడం పలు విమర్శలకు తావిస్తోంది .ఆంధ్ర ప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా బీసీ వర్గానికి కేటాయించాలని గతంలో నిర్ణయించుకున్నారు                           ఈ పదవి కోసం శ్రీకాకుళం ఎంపీ కింజారపు రామ్మోహన్ నాయుడు పేరు ప్రముఖంగా వినపడింది .ఈ మేరకు ఆయన అభిమానులు సోషల్ మీడియా వేదికగా "కాబోవు తెలుగు దేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామ్మోహన్ నాయుడు గారికి శుభాకాంక్షలు" అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది .అంతేకాకుండా కొంతమంది అత్యుత్సాహంతో తెలుగుదేశం పార్టీ కి రాబోవు కాలంలో ముఖ్యమంత్రి అంటూ కూడా ప్రచారం జరిగింది .ఈ ప్రచారం నేపథ్యంలో కినుక వహించిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ,ఆయన కుమారుడు లోకేష్ రాష్ట్ర అధ్యక్ష పదవి భర్తీ చేయడంలో ఆలస్యం చేస్తున్నారని తెలుగుదేశం పార్టీలో చర్చనీయాంశంగా మారింది .ఈ నేపథ్యంలోనే ఈఎస్ఐ కుంభకోణం లో మాజీ మంత్రి టెక్కలి ఎమ్మెల్యే కింజారపు అచ్చం నాయుడు అరెస్ట్ కావడం తో  మొదట్లో పెద్ద ఎత్తున వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఫైవిమర్శల వర్షం కురిపించింది .కింజరాపు రామ్మోహన్ నాయుడు ,ఆయన సోదరి రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని ఆ తర్వాత పెద్దగా స్పందించలేదు .రాజ్యసభ ఎన్నికల్లోనూ తెలుగుదేశం పార్టీకి ఓటు వేయకుండా  చెల్లని ఓటు వేశారు .ఈ నేపథ్యంలో ఆమెపై తెలుగుదేశం పార్టీ అనుమానం వ్యక్తం చేసింది . దీనికి ప్రధాన కారణం ఎమ్మెల్యే భవాని మామ మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు గతంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో పని చేయడమే !ఈ కారణంగానే ఆమె చెల్లని ఓటు వేశారని తెలుగుదేశం పార్టీలో అనుమానం వ్యక్తమవుతోంది .అంతేకాకుండా రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ,ఎమ్మెల్యే భవాని కి మధ్య విభేదాలు రావడంతో ఆమె తెలుగుదేశం పార్టీలో యాక్టివా లేరనే ప్రచారం జరుగుతోంది .తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు పేరు తెరపైకి  వచ్చిన జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబు కు ప్రత్యామ్నాయం గా భవిష్యత్తులో సీఎం పదవికి పోటీ పడతాడని  ఉద్దేశంతో తాజాగా టెక్కలి ఎమ్మెల్యే అచ్చం నాయుడును ఆంధ్ర ప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా నియమించాలనే ఆలోచన ఉన్నట్లుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి .గతంలో నోటుకు ఓటు కేసులో అరెస్టైన రేవంత్ రెడ్డి ని తెలంగాణ తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించిన సంగతి విదితమే !అదేవిధంగా ఈఎస్ఐ కుంభకోణం లొఅరెస్టయిన అచ్చం నాయుడు ను రాష్ట్ర టిడిపి అధ్యక్షుడిగా నియమిస్తారా?లేక రామ్మోహన్ నాయుడు ను నియమిస్తారా?వేచి చూడాల్సిందే .fb twittar linkedin google+ pinterest

WRITE COMMENT

Name:
Phone/Email:
Comment: