బరితెగించిన టిడిపి ఎమ్మెల్యేలు ..వారి చేరికకు రూపాయి జీతం సీఎం 'నో '?
Published by:Admin, Date:31-08-2020:01:22

ప్రజల చేత, ప్రజల కొరకు ,ప్రజలే నిర్మించుకున్నది  ప్రజాస్వామ్యం .కొందరు రాజకీయ నాయకులుతమ  స్వార్థ ప్రయోజనాల కోసం రాజకీయాలు చేస్తూ వారి ఆస్తులను పెంచుకోవడంపై చూపిస్తున్న శ్రద్ధ ,ప్రజలపై చూపించడం లేదు.ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో చేరడం ,ఆస్తులను కాపాడుకోవడం ఇదే ప్రధాన అజెండా వీళ్ళకి సిద్ధాంతాలు ఏమీ ఉండవు .గత తెలుగుదేశం పార్టీ హయాంలో బాగా దోచుకుని తిన్న పలువురు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ,ముఖ్య నాయకులు నేడు వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరడానికి జోరుగా పావులు కదుపుతున్నారు.అటువంటి వారికి రూపాయి జీతంముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి 'నో 'చెప్పినట్లు సమాచారం                                                         మేము వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతాం  ...అయితే మాకేంటి ?అనే డిమాండ్ కొందరు  చేస్తున్నారు.కొంతమంది  డిమాండ్లకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దిమ్మతిరిగిపోతుంది .తనకు  మంత్రి పదవి ఇవ్వాలనికొందరు కోరగా ,తాము ఎన్నికల్లో పోటీ చేసి బాగా ఆర్థికంగా నష్టపోయానని ఆదుకోవాలని కొందరు కోరగా,ఆర్థికంగా ఆదుకోవాల్సిన అవసరం లేదు కానీ తాము చేస్తున్న వ్యాపారాల జోలికి రాకూడదని తనపై విధించిన పెనాల్టీ వందల కోట్లు రద్దు చేయాలని టిడిపి ఎమ్మెల్యేలు డిమాండ్ చేయడంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం షాక్ అయ్యింది .ఇటువంటి వారిని పార్టీలో చేర్చుకునే ప్రసక్తేలేదని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఖరాఖండీగా  చెప్పినట్లు సమాచారం .విశాఖ జిల్లాలో మంచి పలుకుబడి కలిగిన ఎమ్మెల్యే బంధువు భూ ఆక్రమణ ఫిర్యాదు రావడంతో ఎమ్మెల్యే చేరికకు బ్రేక్ పడినట్లు సమాచారం .ఆయనపై ఆరోపణలు రాలేదు కానీ బంధువుల ప్రమేయం ఉండడం ,పార్టీలో మంత్రి ,ఎంపీ వ్యతిరేకించడం కారణంగా తెలుస్తుంది.వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాం నుండి పార్టీ అభివృద్ధికి విశేష కృషి చేసిన కొయ్య ప్రసాద్ రెడ్డి పై భూవివాదంలో జోక్యం చేసుకున్నాడని ఆరోపణలపై నిర్ధాక్షణ్యంగా పార్టీ నుంచి సస్పెండ్ చేసి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తన చిత్తశుద్ధిని నిరూపించుకుంది. గతంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 23మంది ఎమ్మెల్యేలను అడ్డగోలుగా కొనుగోలు చేశారని ఆరోపణలు ఉన్నాయి .ఈ జాబితాలో అప్పటిముగ్గురు ఎంపీలు కూడా ఉన్నారు .చంద్రబాబు నాయుడు కొనుగోలు చేసిన ఆరోపణలు అదే సంఖ్య ఎమ్మెల్యేలు  ,ఎంపీ స్థానాలు గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కి వచ్చాయి .అలా వచ్చినఅప్పటి   ఎమ్మెల్యేలు మైనింగ్ లో బాగా దోచుకున్నారని ఆరోపణలున్నాయి .వందల కోట్లు ప్రభుత్వానికి రావాల్సిన డబ్బులు చెల్లించలేదని తెలిసింది .కొందరు మంత్రి పదవులు హామీపై పార్టీలోకి వచ్చి మంత్రి పదవులు తీసుకున్నారు .కొందరుఎమ్మెల్యేలు అప్పట్లో  కోట్లాది రూపాయల ముడుపులు తీసుకున్నారని ఆరోపణలున్నాయి .రాయలసీమ కు చెందిన ఓ వైసీపీ ఎమ్మెల్యే బహిరంగంగా తెలుగుదేశం పార్టీ వారు తనను పిలుస్తున్నారని కోట్లాది రూపాయలముడుపులు ,నిధులు ఇస్తామని పిలుస్తున్నారని పదే పదే వైసిపి అధిష్టానాన్ని విసిగించాడు దీంతో ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆయనకు వైసిపి అధిష్టానం టికెట్ కట్ చేసింది .ప్రజా సేవే ధ్యేయంగా నియోజకవర్గ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అనధికారికంగా చేరడానికి ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి సుముఖత వ్యక్తం చేసినట్లు తెలిసింది .మంత్రి పదవుల కోసం ,ముడుపుల కోసం ,అక్రమ వ్యాపారం కోసం పార్టీలో చేర్చుకునే ప్రసక్తేలేదని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చెబుతోంది .మరో ముగ్గురు ఎమ్మెల్యేలు టీడీపీని వీడితే ప్రధాన ప్రతిపక్ష హోదా కోల్పోతుంది .అయినప్పటికీ ప్రజా సేవే ధ్యేయంగా ముందుకొచ్చే వారికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ స్వాగతం పలుకుతుంది .టిడిపి ఎమ్మెల్యేలు ఎవరికి కూడా మంత్రి పదవులు ఇవ్వడం కుదరదని ,అక్రమ వ్యాపారాలు ,ముడుపులు కావాలనే వారు తమ పార్టీ అవసరం లేదని రూపాయి జీతం సీఎం చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది .

 

.

 

 fb twittar linkedin google+ pinterest

WRITE COMMENT

Name:
Phone/Email:
Comment: