రఘు రామ కు కంగనా రనౌత్ ఉన్న పరపతికూడా లేదా ?
Published by:Admin, Date:07-09-2020:07:57

నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు కు ఇటీవలనే వై భద్రత క్యాటగిరి కేంద్రం కేటాయించిన విషయం విదితమే .భద్రత కోసం కేంద్రమంత్రి చుట్టూ తిరిగిన దాదాపు నెల రోజులు పట్టింది .భద్రత కోసం హైకోర్టు కూడా కేసు వేశారు .ఇలా ఉండగా బాలీవుడ్ నటి కంగనా కు  మాత్రంవెంటనే భద్రత కేటాయింపుల్లో కేంద్ర మంత్రి అమిత్ షా చొరవచూపినట్లు  తెలిసింది  బాలీవుడ్ క్వీన్ కంగ‌నా రానౌత్ కి కేంద్రం వై క్యాట‌గిరి భ‌ద్ర‌త క‌ల్పించింది.. ఈ మేర‌కు కేంద్ర హోం శాఖ ఆదేశాలు జారీ చేసింది.. సుశాంత్ మ‌ర‌ణం త‌ర్వాత కంగనా బాలీవుడ్ సినీ మాఫియాపై విమ‌ర్శ‌లు జోరు పెంచింది.. బాలీవుడ్ లో డ్ర‌గ్స్ మాఫియా శాసిస్తుంద‌ని ఆరోపించింది.. ప్ర‌స్తుతం ముంబై ఒక పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ గా ఉందంటూ తీవ్ర విమ‌ర్శ‌లు చేసింది.. దీనిపై మ‌హారాష్ట్ర‌లోని శివ‌సేన ప్ర‌భుత్వం కంగనా వ్యాఖ్యాల‌పై మండిప‌డింది.. ఈ వ్యాఖ్యాల‌కు వెంట‌నే క్ష‌మాప‌ణ చెప్పాల‌ని శివ‌సేన డిమాండ్ చేసింది.. క్ష‌మాప‌ణ చెప్ప‌కుండా ముంబైలో అడుగుపెడితే ప‌రిణామాలు తీవ్రంగా ఉంటాయ‌ని కూడా హెచ్చ‌రించింది..ప్ర‌స్తుతం కంగ‌నా స్వంత ప‌ట్ట‌ణం కులు మ‌నాలీలో ఉంటున్నారు.. తాను ఈ నెల 9వ తేదిన ముంబైకి వ‌స్తున్నాన‌ని, ద‌మ్ముంటే అడ్డుకోవాలంటూ శివ‌సేన‌ను నేరుగానే చాలెంజ్ చేసింది.. ఈ వివాదం న‌డుమ హోం శాఖ కంగ‌నా భ‌ద్ర‌త‌పై స‌మీక్ష జ‌రిపింది.. ఇంటెలిజెన్స్ నివేదిక ఆధారంగా ఆమెకు కేంద్ర బ‌ల‌గాల‌తో ర‌క్ష‌ణ క‌ల్పించాల‌ని నిర్ణ‌యించింది.. నేటి నుంచి ఆమెకు వై క్యాట‌గిరి భ‌ద్ర‌త అమ‌లు కానుంది.fb twittar linkedin google+ pinterest

WRITE COMMENT

Name:
Phone/Email:
Comment: