జయప్రకాష్ రెడ్డి మృతితో షాకైన సినీ పరిశ్రమ
Published by:Admin, Date:08-09-2020:10:30

సినీ నటుడు జయప్రకాశ్ రెడ్డి(74) కన్నుమూశారు. మంగళవారం తెల్లవారుజామున గుండెపోటుతో బాత్‌రూమ్‌లోనే కుప్పకూలిపోయారు. కుటుంబ సభ్యులు ఆయన్ని ఆస్పత్రికి తీసుకెళ్లగా ఆయన చనిపోయినట్లు నిర్ధారించారు. కరోనా కారణంగా సినీమా షూటింగ్‌లపై ప్రభుత్వం నిషేధించడంతో ఆయన గుంటూరులో ఉంటున్నారు.బ్రహ్మపుత్రుడు చిత్రం ద్వారా తెలుగు పరిశ్రమకు పరిచయమైనజయ  ప్రకాష్ రెడ్డి విలక్షణమైన నటుడు .ఆయన చేసిన పాత్రలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి .కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గం సిరివెళ్ల  ఆయన స్వస్థలం ,పోలీసు శాఖలో పనిచేస్తున్న ఆయనను తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం చేసింది దాసరి నారాయణరావు ఆయన మృతికి సినీ పరిశ్రమలో పలువురు దిగ్భ్రాంతి వ్యక్తం  చేశారు 

 fb twittar linkedin google+ pinterest

WRITE COMMENT

Name:
Phone/Email:
Comment: