పనుల్లో నాణ్యత లోపిస్తే బిల్లులు చెల్లించే ప్రసక్తే లేదు
Published by:Admin, Date:08-09-2020:02:19

స్మార్ట్ సిటీలో భాగంగా తిరుపతి నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో నాణ్యత లోపిస్తే కఠిన చర్యలు తప్పవని , అభివృద్ధి పనుల్లో తిరుపతి ఆదర్శంగా ఉండాలని నగరపాలక సంస్థ కమిషనర్ గిరీషా కాంట్రాక్టర్లను హెచ్చరించారు. మంగళవారం నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనులను కమిషనర్ తనిఖీ చేశారు. తిరుపతి బాలాజీ కాలనీలోని స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో జరుగుతున్న అభివృద్ధి పనులను చూసి అసంతృప్తి వ్యక్తం చేశారు. మరుగుదొడ్లు, డైనింగ్ హాల్ నిర్మాణ పనుల్లో నాణ్యత లోపించిందన్నారు. ఈతకొలను వద్ద అక్కడక్కడా టైల్స్ లేచి పోయి ఉండడాన్ని చూసి ఆగ్రహం వ్యక్తం చేశారు.  స్మార్ట్ సిటీకి తగ్గ స్థాయిలో పనులు లేవని, కాంట్రాక్టు రద్దు చేస్తామని హెచ్చరించారు. ఈత కొలను చుట్టూ చెత్త తొలగించాలని చెప్పినా ఇంత వరకు ఎందుకు చేయలేదని కాంట్రాక్టర్ ను ప్రశ్నించారు. పనుల్లో నాణ్యత పాటించక పోతే బిల్లులు మంజూరు చేసే ప్రసక్తే లేదని హెచ్చరించారు. 

 

నగరంలో పచ్చదనానికి పెద్దపీట

 

తిరుపతి నగరంలో పచ్చదనానికి పెద్ద పీట వేస్తున్నామని కమిషనర్ గిరీషా అన్నారు. స్థానిక ఎమ్మార్ పల్లి శ్మశాన వాటిక వద్ద  నగరపాలక సంస్థ , తుడా సంయుక్త ఆధ్వర్యంలో చెట్లు నాటేందుకు తుడా కార్యదర్శి లక్ష్మితో కలసి కమిషనర్  స్థల పరిశీలన చేశారు. శ్మశాన వాటిక , సచివాలయం చుట్టూ, సీకాం కాలేజీ సందు వద్ద రోడ్డుకు ఇరువైపులా నాటేందుకు నిర్ణయించారు. అలాగే పక్కనే ఉన్న బండారు ఆంజనేయ స్వామి ఆలయం సందు, నగరపాలక సంస్థ ట్రాన్స్ఫర్ స్టేషన్ సందు పరిశీలించి ఇరువైపులా శుభ్రం చేసి చెట్లు నాటాలని సూచించారు. ఇప్పటికే నగరంలో పచ్చదనం పెంచేందుకు విరివిగా పార్కులు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. నగరంలో పచ్చదనం పెంచేందుకు ప్రజలు కూడా ఇందుకు సహకరించాలన్నారు.

 

అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయండి

 

నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలని కమిషనర్ గిరీషా కాంట్రాక్టర్ల కు సూచించారు. నగరపాలక సంస్థ కార్యాలయం వెనుక భాగంలో కల ఇందిరా మైదానంలో జరుగుతున్న అభివృద్ధి పనులను కమిషనర్ గిరీషా పరిశీలించారు. పనులు నత్తనడకన సాగుతుండడంతో కమిషనర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పనులు ఎందుకు ఆలస్యం అవుతున్నాయనేందుకు కాంట్రాక్టర్ పొంతనలేని సమాధానాలు చెప్పారు. ప్లాన్ ను పరిశీలించి వారం రోజుల్లో వస్థానని ఈ లోపు పిల్లర్లు పూర్తి కావాలని హెచ్చరించారు. నెల లోపు అన్ని పనులు పూర్తి కావాలని సూచించారు. పనుల్లో నాణ్యత లోపించినా, సకాలంలో పూర్తి చేయకపోయినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అభివృద్ధి పనులు చేయడంలో తిరుపతి ఆదర్శంగా నిలవాలని సూచించారు. 

ఈ కార్యక్రమంలో కమిషనర్ వెంట సూపరింటెండెంట్ ఇంజినీర్ చంద్రశేఖర్, తుడా కార్యదర్శి లక్ష్మీ, ఏకాం ప్రతినిధులు బాలాజీ, రాజేంద్ర, నగరపాలక, తుడా అధికారులు ఉన్నారు.fb twittar linkedin google+ pinterest

WRITE COMMENT

Name:
Phone/Email:
Comment: