సుశాంత్ కేసులో కీలక మలుపు.. రియా అరెస్ట్ Published by:Admin, Date:08-09-2020:06:20 |
|
సుశాంత్ అనుమానాస్పద మృతి కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న అతని ప్రియురాలు రియా చక్రవర్తిని నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) మంగళవారం అరెస్ట్ చేసింది. డ్రగ్స్ మాఫియాతో రియాకు సంబంధాలున్నట్లు గుర్తించిన ఎన్సీబీ ఆమెను అదుపులోకి తీసుకుంది. డ్రగ్స్ కేసులో రియాను మూడు రోజుల పాటు ఎన్సీబీ విచారించింది. ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తిని కూడా ఎన్సీబీ అధికారులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. సుశాంత్ కోసం డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు విచారణలో రియా అంగీకరించింది.
అయితే.. తాను మాత్రం డ్రగ్స్ వినియోగించలేదని, కేవలం సుశాంత్ కోసమే కొనుగోలు చేశానని రియా చెప్పుకొచ్చింది. తీగ లాగితే డొంక కదిలినట్టుగా.. సుశాంత్ కేసులో డ్రగ్స్ వినియోగం దగ్గర మొదలైన విచారణ, బాలీవుడ్లో డ్రగ్స్ మత్తులో మునిగితేలే వారి పేర్లను రియా బయటపెట్టేవరకూ వెళ్లింది. మొత్తం 25 మంది బాలీవుడ్ సెలబ్రెటీల పేర్లను ఎన్సీబీ విచారణలో రియా చక్రవర్తి బయటపెట్టినట్టు సమాచారం. |
![]() ![]() |
WRITE COMMENT
తాజా వార్తలు తాజా వార్తలు
|
స్వీమ్స్ లోని కోవిడ్ -19 ల్యాబ్ కు రూ.25 లక్షలు విరాళం |
|
సెప్టెంబరు 29 నుండి తిరుమలలో '' షోడశదిన సుందరకాండ దీక్ష '' |
|
బాలు మృతి పై టీటీడీ ఛైర్మన్ సంతాపం |
|
తిరుమలలో కర్ణాటక సత్రాల వసతి సముదాయాల నిర్మాణానికి భూమిపూజ |
|
ఈనెల 23, 24 ముఖ్యమంత్రితిరుపతిపర్యటన |
సినిమా వార్తలు
|
బాలీవుడ్ డ్రగ్స్ కేసు విచారణను వేగవంతం |
|
అల్లు అర్జున్‌పై పోలీస్ కంప్లైంట్ |
|
.విభిన్న పాత్రలతో మెప్పించిన జయప్రకాష్ రెడ్డి |
|
సుశాంత్ కేసులో కీలక మలుపు.. రియా అరెస్ట్ |
|
ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం హెల్త్ బులిటెన్ |